Electric cars : మతిపోయే డిజైన్‌తో హోండా కొత్త ఎలక్ట్రిక్ కార్లు- రేంజ్ ఎంతంటే..
ఫ్యూచరిస్టిక్ డిజైన్‌తో కూడిన రెండు ఎలక్ట్రిక్ వాహనాలను హోండా సంస్థ రెడీ చేస్తోంది. వీటిల్లో ఒకటి ఎలక్ట్రిక్ ఎస్యూవీ, మరొకటి ఎలక్ట్రిక్ సెడాన్. ఈ ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన కాన్సెప్ట్స్‌ని త్వరలోనే ఆవిష్కరించనుంది. పూర్తి వివరాలు..
ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్న డిమాండ్‌ని క్యాష్ చేసుకునేందుకు ఆటోమొబైల్ సంస్థలు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోటీని తట్టుకునేందుకు సరికొత్త టెక్నాలజీ, సరికొత్త డిజైన్‌తో కస్టమర్స్‌ని ఈ కంపెనీలు ఆకర్షిస్తన్నాయి. ఇక ఇప్పుడు దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ హోండా రెండు కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను సిద్ధం చేస్తోంది. హోండా ‘0’ సిరీస్‌లో ఇవి భాగంగా ఉన్నాయి. వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్) 2025లో ఈ 0 సిరీస్‌లోని ఎలక్ట్రిక్ ఎస్యూవీ, ఎలక్ట్రిక్ సెడాన్ కాన్సెప్ట్స్‌ని ఆవిష్కరించనున్నట్టు హోండా వెల్లడించింది. ఈ దశాబ్దం చివరి నాటికి బ్రాండ్ ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్న 7 0 సిరీస్ ఎలక్ట్రిక్ కార్లలో ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ, సెడాన్ భాగం కానున్నాయి. 2026లో ఇవి ప్రొడక్షన్ స్టేజ్‌కి వెళతాయి. అయితే, కాన్సెప్ట్ వర్షెన్ లాంచ్‌కి ముందు, ఆటో మేజర్ ఈ రెండు ఎలక్ట్రిక్ కార్లకు సంబంధించిన టీజర్‌ని విడుదల చేసింది.
హోండా టీజ్ చేసిన ఈ రెండు ఎలక్ట్రిక్ కార్లు ఫ్యూచరిస్టిక్ లుక్స్‌తో వస్తాయి. ఎలక్ట్రిక్ ఎస్యూవీ, సెడాన్ రెండూ కొత్త బీస్పోక్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటాయి. ఆసక్తికరంగా.. హోండా 0 సిరీస్ సెడాన్ కాన్సెప్ట్‌ని గతంలో ప్రదర్శించడం జరిగింది. రాబోయే ఎస్యూవీ కాన్సెప్ట్ టీజర్ చిత్రం సూచించినట్లుగా దాని డిజైన్ ఫిలాసఫీని పంచుకుంటుంది. ఫ్లాట్ ఫ్రంట్, రేర్ ప్రొఫైల్‌తో పాటు స్లీక్ ఎల్ఈడీ లైట్లు రెండు కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ వాహనాల్లోని డిజైన్ అంశాలు.
హోండా 0 సిరీస్: స్పెసిఫికేషన్లు..
హోండా ఇప్పటికే 0 సిరీస్ ఎలక్ట్రిక్ వాహనల ప్లాట్‌ఫామ్‌కు సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్స్ వివరాలను వెల్లడించింది. హోండా 0 సిరీస్ మోడళ్లు సింగిల్, డ్యూయల్-మోటార్ ఇంజిన్స్‌తో అందుబాటులో ఉంటాయి. కొత్తగా అభివృద్ధి చేసిన కాంపాక్ట్ ఈ-యాక్సిల్స్ కలిగి ఉంటాయి. ఈ-యాక్సిల్స్ ద్వారా కారులో స్పేస్ పెరుగుతుందని, వాహనం ఫ్రెంటల్ ఏరియా తగ్గుతుందని సంస్థ పేర్కొంది. ఇది ఏరోడైనమిక్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందని, ఫలితంగా మెరుగైన రేంజ్‌ని అందిస్తుందని హోండా వెల్లడించింది.
హోండా 0 సిరీస్ ఎలక్ట్రిక్ వాహనాల ఎంట్రీ లెవల్ వేరియంట్లు.. రేర్ యాక్సిల్‌లో 245 బీహెచ్పీ మోటార్‌తో వస్తాయి. రేర్ వీల్ డ్రైవ్ వీటిల్లో ఉంటాయి. అలాగే, రెండు డ్యూయల్-మోటార్ ఫోర్-వీల్ డ్రైవ్ వేరియంట్లు ఉన్నాయి. ఇది 245 బీహెచ్పీ రేర్ మోటార్‌ని 68 బీహెచ్పీ ఫ్రంట్ మోటార్‌తో కనెక్ట్ చేసి ఉంటుంది. ఇతర ఎలక్ట్రిక్ కార్ల మాదిరిగానే ఈ ఎలక్ట్రిక్ వాహనాలు నికెల్-మాంగనీస్-కోబాల్ట్ (ఎన్ఎంసి) బ్యాటరీ ప్యాక్లను ఉపయోగిస్తాయి.
ఈ బ్యాటరీ ప్యాక్లు 80 కిలోవాట్ల నుంచి 90 కిలోవాట్ల మధ్య సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. వీటిని ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు 480 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తాయి. ఈ బ్యాటరీ ప్యాక్లను సాధ్యమైనంత సన్నగా చేయడమే తమ లక్ష్యమని హోండా పేర్కొంది. జపాన్ ఆటో ఓఈఎం 0 సిరీస్ ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ ప్యాక్లు ప్రత్యర్థి వాహన తయారీదారుల ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల కంటే 8ఎంఎం సన్నగా ఉంటాయని పేర్కొంది.
సంబంధిత కథనం