అతి తక్కువ వడ్డీకి హోమ్​ లోన్​ ఇస్తున్న బ్యాంకులు ఇవి..-home loans june 2025 lowest interest rates from these top banks ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  అతి తక్కువ వడ్డీకి హోమ్​ లోన్​ ఇస్తున్న బ్యాంకులు ఇవి..

అతి తక్కువ వడ్డీకి హోమ్​ లోన్​ ఇస్తున్న బ్యాంకులు ఇవి..

Sharath Chitturi HT Telugu

సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు హోమ్​ లోన్​ తీసుకోవాలని ప్లాన్​ చేస్తున్నారా? ఇయితే ఇది మీకోసమే. దేశంలోని ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్​ బ్యాంకులు గృహ రుణాలపై ఇస్తున్న వడ్డీ రేట్ల వివరాలను ఇక్కడ చూసేయండి..

హోమ్​ లోన్​పై వడ్డీ రేట్లు- ఏ బ్యాంకులో తక్కువ?

దేశంలో రెపో రేట్లను ఆర్బీఐ (రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా) తగ్గిస్తున్న సమయంలో.. లోన్​లు తీసుకోవడానికి ఇదే సరైన సమయం అని నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే చాలా మంది లోన్​ తీసుకుని సొంత ఇంటి కలల్ని నెరవేర్చుకోవాలని ప్లాన్​ చేస్తున్నారు. వీరిలో మీరూ ఉన్నారా? అయితే ఇది మీకోసమే! రెపో రేట్లను ఆర్బీఐ తాజాగా 50 బేసిస్​ పాయింట్లు తగ్గించడంతో హోమ్​ లోన్​లు కూడా దిగొస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్​ బ్యాంకులు, గృహ రుణాలపై అవి అందిస్తున్న వడ్డీ రేట్ల వివరాలను ఇక్కడ తెలుసుకోండి. మీకు కచ్చితంగా ఉపయోగపడుతుంది..

హోమ్​ లోన్​పై వడ్డీ రేట్లు- ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇలా..

ఎస్​బీఐ-

  • రూ. 30లక్షల వరకు- 8%-9.20%
  • రూ. 30లక్షల నుంచి రూ. 75లక్షల వరకు- 8%- 9.20%
  • రూ. 75లక్షల కన్నా ఎక్కువ- 8% - 9.20%

బ్యాంక్​ ఆఫ్​ బరోడా-

  • రూ. 30లక్షల వరకు- 8%-9.65%
  • రూ. 30లక్షల నుంచి రూ. 75లక్షల వరకు- 8%- 9.65%
  • రూ. 75లక్షల కన్నా ఎక్కువ- 8% - 9.90%

పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​-

  • రూ. 30లక్షల వరకు- 7.55%-9.35%
  • రూ. 30లక్షల నుంచి రూ. 75లక్షల వరకు- 7.5%- 9.25%
  • రూ. 75లక్షల కన్నా ఎక్కువ- 7.5% - 9.25%

కెనరా బ్యాంక్​-

  • రూ. 30లక్షల వరకు- 8%-10.75%
  • రూ. 30లక్షల నుంచి రూ. 75లక్షల వరకు- 7.95%- 10.35%
  • రూ. 75లక్షల కన్నా ఎక్కువ- 7.90% - 10.65%

బ్యాంక్​ ఆఫ్​ మహారాష్ట్ర-

  • రూ. 30లక్షల వరకు- 7.35%-10.15%
  • రూ. 30లక్షల నుంచి రూ. 75లక్షల వరకు- 7.35%- 10.15%
  • రూ. 75లక్షల కన్నా ఎక్కువ- 7.35% - 10.15%

ఇండియన్​ బ్యాంక్​-

  • రూ. 30లక్షల వరకు- 7.40%-9.40%
  • రూ. 30లక్షల నుంచి రూ. 75లక్షల వరకు- 7.40%- 9.40%
  • రూ. 75లక్షల కన్నా ఎక్కువ- 7.40% - 9.40%

బ్యాంక్​ ఆఫ్​ ఇండియా-

  • రూ. 30లక్షల వరకు- 7.85%-10.35%
  • రూ. 30లక్షల నుంచి రూ. 75లక్షల వరకు- 7.85%- 10.35%
  • రూ. 75లక్షల కన్నా ఎక్కువ- 7.85% - 10.60%

హోమ్​ లోన్​పై వడ్డీ రేట్లు- ప్రైవేటు బ్యాంకుల్లో ఇలా..

హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​-

  • రూ. 30లక్షల వరకు- 8.45శాతం నుంచి
  • రూ. 30లక్షల నుంచి రూ. 75లక్షల వరకు- 8.45శాతం నుంచి
  • రూ. 75లక్షల కన్నా ఎక్కువ- 8.45శాతం నుంచి

ఐసీఐసీఐ బ్యాంక్​-

  • రూ. 30లక్షల వరకు- 8.50% నుంచి
  • రూ. 30లక్షల నుంచి రూ. 75లక్షల వరకు- 8.50% నుంచి
  • రూ. 75లక్షల కన్నా ఎక్కువ- 8.50% నుంచి

కొటాక్​ మహీంద్రా బ్యాంక్​-

  • రూ. 30లక్షల వరకు- 8.65% నుంచి
  • రూ. 30లక్షల నుంచి రూ. 75లక్షల వరకు- 8.65% నుంచి
  • రూ. 75లక్షల కన్నా ఎక్కువ- 8.65% నుంచి

ఆర్​బీఎల్​ బ్యాంక్​-

  • రూ. 30లక్షల వరకు- 9% నుంచి
  • రూ. 30లక్షల నుంచి రూ. 9% నుంచి
  • రూ. 75లక్షల కన్నా ఎక్కువ- 9% నుంచి

యాక్సిస్​ బ్యాంక్​-

  • రూ. 30లక్షల వరకు- 8.75%-12.80%
  • రూ. 30లక్షల నుంచి రూ. 75లక్షల వరకు- 8.75%- 12.80%
  • రూ. 75లక్షల కన్నా ఎక్కువ- 8.75% - 9.65%

బంధన్​ బ్యాంక్​-

  • రూ. 30లక్షల వరకు- 8.66%-15%
  • రూ. 30లక్షల నుంచి రూ. 75లక్షల వరకు- 8.66%- 12.83%
  • రూ. 75లక్షల కన్నా ఎక్కువ- 8.66% - 12.83%

(పైన చెప్పిన వివరాలు 2025 జూన్​ 11 పాలసీబజార్​ డేటాకు సంబంధించినవి.)

హోమ్​ లోన్​ తీసుకునే ముందు వడ్డీ రేటుతో పాటు ప్రాసెసింగ్​ ఫీజు, ప్రీపేమెంట్​ పెనాల్టీలు, లోన్​ టెన్యూర్​, కస్టమర్​ సర్వీస్​ వంటి వివరాలు కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. పబ్లిక్​ రంగ బ్యాంకుల్లో ఇవి సాధారణంగా తక్కువగానే ఉంటాయి. ప్రైవేట్​ సెక్టార్​ బ్యాంకుల్లో ఫీజులు ఎక్కువ ఉన్నా, లోన్​కి త్వరగా ఆమోద ముద్ర లభిస్తుంది.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. లోన్​ తీసుకోవడం రిస్కీ అని గుర్తుపెట్టుకోవాలి.)

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం