Bank holiday : తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు బ్యాంక్‌లకు సెలవు ఉందా?
Bank holiday today : దేశం నేడు హోలీ వేడుకలు జరుపుకోనుంది. మరి తెలుగు రాష్ట్రాల్లో బ్యాంక్‌లకు నేడు సెలవు ఉందా? లేక బ్యాంక్‌లు పనిచేస్తాయా? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్గదర్శకాల ప్రకారం హోలీ సందర్భంగా 2025 మార్చ్14, అంటే శుక్రవారం దేశంలోని అనేక ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు. అహ్మదాబాద్, ఐజ్వాల్, బేలాపూర్, భోపాల్, ఛండీగఢ్, డెహ్రాడూన్, గ్యాంగ్‌టక్, గౌహతి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇటానగర్, జైపూర్, జమ్ము, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూదిల్లీ, పనాజీ, పట్నా, రాయ్‌పూర్, రాంచీ, షిల్లాంగ్, సిమ్లా, శ్రీనగర్ వంటి నగరాల్లో నేడు బ్యాంకులు మూతపడి ఉంటాయని కస్టమర్లు గుర్తుపెట్టుకోవాలి.
హోలీ వేడుకల్లో భాగంగా మార్చ్ 13న దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో బ్యాంక్‌లు మూతపడి ఉన్నాయి. 14 కూడా సెలవు ఉంది. 15న, శనివారం మాత్రం బ్యాంక్‌లు పనిచేస్తాయి. మార్చ్ 16 ఆదివారం వారాతంపు సెలవు ఉంది. ఇక మార్చ్ 22 (రెండో శనివారం), మార్చ్ 23 ఆదివారం, మార్చ్ 30 ఆదివారం కారణంగా ఈ నెలలో బ్యాంక్‌లకు మరిన్ని సెలవులు లభించనున్నాయి. వీటిని కస్టమర్లు గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం.
మార్చ్ 14న స్టాక్ మార్కెట్లు ఓపెన్‌లో ఉంటాయా? ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.
బ్యాంకులు ఎప్పుడు మూతపడతాయి?
ప్రాంతీయ, జాతీయ పండుగల ఆధారంగా వివిధ రాష్ట్రాలను బట్టి దేశవ్యాప్తంగా బ్యాంకు సెలవులు మారుతూ ఉంటాయని వినియోగదారులు గమనించాలి. పండుగలతో పాటు.. రెండు, నాలుగో శనివారాలు, అన్ని ఆదివారాలు బ్యాంకులకు సెలవు. అందువల్ల, కస్టమర్లు తమ సమీప బ్యాంకు శాఖలో సెలవుల జాబితాను చెక్ చేయాలి.
బ్యాంకు సెలవులను ఎక్కడ చెక్ చేసుకోవాలి?
నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ నిబంధనల ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించిన వార్షిక హాలిడే క్యాలెండర్లో అన్ని బ్యాంకు సెలవులు లిస్ట్ అయ్యి ఉంటాయి. ఇది.. చెక్కులు, ప్రామిసరీ నోట్ల జారీకి సంబంధించినది. ఇలాంటి సెలవు రోజుల్లో ఈ సాధనాలకు సంబంధించిన లావాదేవీలు అందుబాటులో ఉండవు.
బ్యాంకు సెలవుల్లో ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉన్నాయా?
బ్యాంకుల సెలవులతో సంబంధం లేకుండా అన్ని బ్యాంకులు తమ ఆన్లైన్, మొబైల్ బ్యాంకింగ్ సేవల యాప్స్‌ని ఆపరేట్ చేస్తాయి. అటువంటి సేవల లభ్యత కోసం వినియోగదారులు తాజా నోటిఫికేషన్లను చెక్ చేయాలి. కస్టమర్లు బ్యాంకు ఏటీఎంల నుంచి కూడా నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు.
మార్చ్ 14న హోలీ..
హోలీ అనేది రంగుల పండుగగా ప్రసిద్ధి చెందిన హిందూ ఫెస్టివల్. ఇది సాధారణంగా హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం మార్చ్ నెలలో వస్తుంది. ఈ పండుగ శ్రీకృష్ణుడు- రాధల మధ్య దైవిక ప్రేమను కూడా హైలైట్ చేస్తుంది. ఈ రోజున, ప్రజలు వసంత ఋతువు ప్రారంభానికి గుర్తుగా రంగులతో ఆడుకుంటారు. తీపి వంటకాలను తింటారు. హోలీకి ముందు హోలీకా దహన్ వేడుక ఉంటుంది. దీనిని చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా చూస్తారు.
యావోసాంగ్ డే 2..
యొసాంగ్ డే 2 కారణంగా ఇటానగర్‌లోని బ్యాంకులు నేడు మూతపడి ఉంటాయి. పిచ్కారీ అని కూడా పిలిచే ఈ పండుగను మణిపూర్‌లో కూడా జరుపుకుంటారు. హోలీని పోలే విధంగా ఇందులోనూ రంగులు, సంగీతం, నృత్యం ఉంటాయి.
సంబంధిత కథనం