స్థిరమైన రాబడి కోసం చాలా మంది ఫిక్స్డ్ డిపాజిట్లలో (ఎఫ్డీ) పెట్టుబడి పెడుతుంటారు. అయితే ఇందులో చేరే ముందు వివిధ బ్యాంకులు అందించే వడ్డీ రేట్లను పోల్చి చూసుకోవడం చాలా ముఖ్యం! వడ్డీ రేట్ల మధ్య స్వల్ప తేడా ఉన్నప్పటికీ, కాలక్రమేణా ఆ మొత్తం గణనీయంగా పెరుగుతుంది. అందుకే ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల మధ్య రేట్లను పోల్చి చూడాలి. ఉదాహరణకు సాధారణంగా బ్యాంకులు ఒకే రకమైన వడ్డీ రేట్లను అందిస్తున్నప్పటికీ, 50 బేసిస్ పాయింట్ల (0.50 శాతం) తేడా కూడా మీకు మంచి లాభాన్ని ఇస్తుంది.
దీన్ని ఒక ఉదాహరణతో చూద్దాము..
మీరు రూ. 10 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే, 0.5% అదనపు వడ్డీతో ఏడాదికి రూ. 5,000 అదనంగా వస్తుంది. పన్నుల తర్వాత ఈ మొత్తం మారుతుంది. అందుకే ఏ బ్యాంకులో ఎంత వడ్డీ రేటు ఉందో తెలుసుకోవడం అవసరం.
ఇక్కడ మనం కొన్ని ప్రముఖ బ్యాంకులు తమ ఏడాది కాలపరిమితి ఎఫ్డీలపై అందిస్తున్న తాజా వడ్డీ రేట్లను పోల్చి చూద్దాం.
ఈ బ్యాంకులు ఇతర బ్యాంకులతో పోలిస్తే అధిక వడ్డీ రేట్లను అందిస్తున్నాయి.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్: దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ.. ఏడాది కాలపరిమితి గల ఫిక్స్డ్ డిపాజిట్లపై సాధారణ ఖాతాదారులకు 6.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.75 శాతం వడ్డీని అందిస్తోంది. ఈ రేట్లు జూన్ 25, 2025 నుంచి అమల్లో ఉన్నాయి.
ఐసీఐసీఐ బ్యాంక్: ఈ ప్రైవేట్ బ్యాంక్ కూడా ఏడాది ఎఫ్డీలపై సాధారణ ఖాతాదారులకు 6.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.75 శాతం వడ్డీ రేట్లను ఇస్తోంది.
కోటక్ మహీంద్రా బ్యాంక్: కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా ఏడాది కాలపరిమితి ఎఫ్డీలపై సాధారణ ఖాతాదారులకు 6.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.75 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది.
ఫెడరల్ బ్యాంక్: ఈ ప్రైవేట్ బ్యాంకు సాధారణ ఖాతాదారులకు 6.40 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.90 శాతం వడ్డీని అందిస్తోంది. ఈ రేట్లు ఆగస్టు 18 నుంచి అమల్లోకి వచ్చాయి.
| బ్యాంకు | సాధారణ వడ్డీ (%) | సీనియర్ సిటిజెన్లకు (%) |
|---|---|---|
| HDFC Bank | 6.25 | 6.75 |
| ICICI Bank | 6.25 | 6.75 |
| Kotak Mahindra | 6.25 | 6.75 |
| Federal Bank | 6.40 | 6.90 |
| SBI | 6.25 | 6.75 |
| Union Bank of India | 6.40 | 6.90 |
(సోర్స్- బ్యాంకుల వెబ్సైట్లు)
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ): దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన ఎస్‌బీఐలో సాధారణ ఖాతాదారులకు 6.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.75 శాతం వడ్డీ లభిస్తోంది. ఈ కొత్త రేట్లు జులై 15, 2025 నుంచి అమల్లోకి వచ్చాయి.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: ఈ ప్రభుత్వ రంగ బ్యాంక్ సాధారణ ఖాతాదారులకు 6.40 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.90 శాతం వడ్డీని ఇస్తోంది. ఈ రేట్లు ఆగస్టు 20 నుంచి అమల్లోకి వచ్చాయి.
మరిన్ని ఫైనాన్షియల్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం