highest FD interest rates 2022: ఎఫ్‌డీపై 8 శాతం వడ్డీ ఇస్తున్న బ్యాంకు ఇదే-highest fd interest rates 2022 bandhan bank offers 8 percent interest rate on fixed deposits ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Highest Fd Interest Rates 2022 Bandhan Bank Offers 8 Percent Interest Rate On Fixed Deposits

highest FD interest rates 2022: ఎఫ్‌డీపై 8 శాతం వడ్డీ ఇస్తున్న బ్యాంకు ఇదే

HT Telugu Desk HT Telugu
Nov 07, 2022 02:37 PM IST

highest FD interest rates 2022: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అత్యధికంగా వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది ఈ బ్యాంక్.

ఎఫ్‌డీపై అత్యధిక వడ్డీ రేటు ఇస్తున్న బ్యాంక్ బంధన్ బ్యాంక్
ఎఫ్‌డీపై అత్యధిక వడ్డీ రేటు ఇస్తున్న బ్యాంక్ బంధన్ బ్యాంక్ (Mint)

బంధన్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. ఇది స్పెషల్ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్‌తో చేస్తున్న స్కీమ్‌గా తెలిపింది. రూ. 2 కోట్ల వరకు గల రుణాలపై 8 శాతం వరకు వడ్డీ రేట్లు చెల్లించనున్నట్టు తెలిపింది. నవంబరు 7 నుంచి అమల్లోకి వస్తుందని, కొత్త ఫిక్స్‌డ్ డిపాజిట్లు, అలాగే రెన్యువల్స్‌పై కూడా వర్తిస్తుందని తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు

  • తాజా సవరణల ప్రకారం కస్టమర్లు 600 రోజుల కాలపరిమితి గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.5 శాతం వడ్డీ పొందుతారు. సీనియర్ సిటిజన్లయితే అదనంగా మరో 0.5 శాతం వడ్డీ రేటుతో బంధన్ బ్యాంక్ ఎఫ్‌డీ స్వీకరిస్తుంది. అంటే వీరికి మొత్తంగా 8 శాతం వడ్డీ చెల్లిస్తుంది. అయితే ఏడాది లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లయితే సీనియర్ సిటిజెన్లకు 0.75 శాతం అదనంగా వడ్డీ లభిస్తుంది.

బంధన్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఇలా

Bandhan Bank special FD scheme: 8 శాతం వరకు వడ్డీ రేటు ఆఫర్ చేస్తోన్న బంధన్ బ్యాంక్
Bandhan Bank special FD scheme: 8 శాతం వరకు వడ్డీ రేటు ఆఫర్ చేస్తోన్న బంధన్ బ్యాంక్

బంధన్ బ్యాంక్ కస్టమర్లు కూడా ఈ పథకంలో చేరొచ్చు. వారి రీటైల్ ఇంటర్‌నెట్ బ్యాంకింగ్ ఖాతా నుంచి గానీ, ఎం-బంధన్ మొబైల్ యాప్ ద్వారా గానీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయవచ్చు. ఆన్‌లైన్ సౌకర్యం ద్వారా కస్టమర్లు ఇంటినుంచే ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసేయొచ్చు.

ఈ ప్రయివేటు రంగ బ్యాంకు సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికంలో రూ. 209.30 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొండి బకాయిలు తగ్గడంతో లాభాలు పెరిగినట్టు చూపింది. కోల్‌కతా ప్రధాన కార్యాలయంగా ఉన్న ఈ బంధన్ బ్యాంక్ గత ఏడాది రెండో త్రైమాసికంలో రూ. 3,008 కోట్ల నష్టాలను చూపింది.

WhatsApp channel

టాపిక్