ఇంధన ధరలు తగ్గించుకునేందుకు చూస్తున్న మిడిల్ క్లాస్ వాహనదారులకు అలర్ట్! 330 కి.మీ వరకు మైలేజ్ ఇచ్చే ఫ్రీడమ్ 125 సీఎన్జీ బైక్‌పై తగ్గింపును ప్రకటించింది బజాజ్ ఆటో. ఈ ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్‌పై రూ. 5వేలు తగ్గిస్తున్నట్టు వెల్లడించింది. ఈ నేపథ్యంలో బజాజ్ ఫ్రీడమ్ 125 గురించి, ధర తగ్గింపు గురించి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్జీ ఎక్స్‌షోరూం ధర రూ. 90,270 నుంచి రూ. 1.10లక్షల వరకు ఉంటుంది. కాగా ఫ్రీడమ్ 125 సీఎన్జీ బైక్ ధరను తగ్గిస్తున్నట్టు కంపెనీ సోషల్ మీడియాలో వెల్లడించింది. అయితే, ఈ ధర తగ్గింపు NG04 డ్రమ్ వేరియంట్ (బేస్ వేరియంట్)కు మాత్రమే వర్తిస్తుందని గమనించాలి. ఇది శాశ్వత ధర తగ్గింపు కాదని, ఈ డిస్కౌంట్ ఆఫర్ కొంతకాలం తర్వాత ముగుస్తుందని బజాజ్ స్పష్టం చేసింది.
ఫ్రీడమ్ 125 సీఎన్జీ బైక్ 125 సీసీ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది సీటు కింద ఉన్న సీఎన్జీ ట్యాంక్‌తో అనుసంధానించి ఉంటుంది. 2 కిలోల సీఎన్జీ ట్యాంక్, 2-లీటర్ పెట్రోల్ ట్యాంక్ ఉండటం వల్ల ఇతర 125 సీసీ మోడళ్ల కంటే దీని బరవు కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఈ ఇంజిన్ 9.4 బీహెచ్‌పీ పవర్‌ని, 9.7 ఎన్‌ఎమ్ పీక్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
బజాజ్ ఆటో ప్రకారం.. ఫ్రీడమ్ 125 సాంప్రదాయ 125 సీసీ పెట్రోల్ మోటార్‌సైకిళ్లతో పోలిస్తే నిర్వహణ ఖర్చులను 50 శాతం వరకు గణనీయంగా తగ్గిస్తుంది! సీఎన్జీపై నడుస్తున్నప్పుడు ఈ బైక్ 102 కి.మీ./కేజీ మైలేజీని ఇస్తుందని, పెట్రోల్ ఉపయోగించినప్పుడు 64 కి.మీ./లీటరు మైలేజీని ఇస్తుందని తయారీదారు పేర్కొన్నారు. ట్యాంక్ ఫుల్ చేస్తే.. ఫ్రీడమ్ 125 కేవలం సీఎన్జీపై 200 కి.మీ.ల వరకు ప్రయాణించగలదని బజాజ్ పేర్కొంది. పెట్రోల్‌ని కూడా కలుపుకుంటే అదనంగా 130 కి.మీలు, మొత్తం మీద 330 కి.మీ.ల కంబైన్డ్ మైలేజ్ లభిస్తుందని వివరించింది.
ఫీచర్ల విషయానికొస్తే, బజాజ్ ఫ్రీడమ్ 125 బైక్‌లో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, రేర్‌లో మోనోలింక్ సస్పెన్షన్ సిస్టమ్ ఉన్నాయి. అదనంగా, టాప్ వేరియంట్‌లో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఉంటుంది. సీఎన్జీ సిలిండర్ ఉండటం వల్ల సీటు ఎత్తు 825 ఎంఎంగా ఉంటుంది. క్విల్టెడ్ స్టిచింగ్ సౌకర్యాన్ని పెంచడానికి రూపొందించిననప్పటికీ, ఈ మోడల్ తగినంత అండర్-థై సపోర్ట్‌ను అందించదు!
సంబంధిత కథనం