Hero Xpulse 210 : అడ్వెంచర్స్​కి ఈ స్టైలిష్​ బైక్​ బెస్ట్​! వేరియంట్లు, వాటి ధరల వివరాలు..-hero xpulse 210 variants features and prices explained see details inside ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hero Xpulse 210 : అడ్వెంచర్స్​కి ఈ స్టైలిష్​ బైక్​ బెస్ట్​! వేరియంట్లు, వాటి ధరల వివరాలు..

Hero Xpulse 210 : అడ్వెంచర్స్​కి ఈ స్టైలిష్​ బైక్​ బెస్ట్​! వేరియంట్లు, వాటి ధరల వివరాలు..

Sharath Chitturi HT Telugu
Jan 27, 2025 06:11 AM IST

Best adventure bikes : హీరో ఎక్స్​పల్స్ 210 రెండు వేరియంట్ ఆప్షన్స్​లో లభిస్తుంది. ఈ అడ్వెంచర్​ బైక్​ వేరియంట్లు, వాటి ఫీచర్లు- ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

హీరో ఎక్స్​పల్స్​ 210
హీరో ఎక్స్​పల్స్​ 210

ఇటీవలే జరిగిన భారత్​ మొబిలిటీ గ్లోబల్​ ఎక్స్​పో 2025లో చాలా ప్రాడక్ట్స్​ లాంచ్​ అయ్యాయి. వాటిల్లో ఒకటి హీరో ఎక్స్​పల్స్​ 210. ఈ అడ్వెంచర్​ బైక్ సూపర్​​ స్టైల్​, డిజైన్​ కారణంగా ఆటోమొబైల్​ ప్రియులను ఆకర్షించింది. ఈ బైక్​ ఎప్పుడెప్పుడు అందుబాటులోకి వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ బైక్​ వేరియంట్లు, వాటి ఫీచర్లు- ధరలతో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

yearly horoscope entry point

హీరో ఎక్స్​పల్స్ 210: టాప్ వేరియంట్​..

హీరో ఎక్స్​పల్స్ 210 టాప్ ట్రిమ్ ఫుల్లీ లోడెడ్ వేరియంట్​గా వస్తుంది. ఇన్​స్ట్రుమెంట్ క్లస్టర్​లో 4.2 ఇంచ్​ టీఎఫ్​టీ డిస్​ప్లేను అందించారు. ఈ డిస్​ప్లే టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్, ఎస్ఎంఎస్ అలర్ట్స్ సహా మరెన్నో ఫీచర్స్​ని కలిగి ఉంది. అలాగే, ఈ వేరియంట్ ట్రాన్స్​పరెంట్​ విండ్​స్క్రీన్​, నకిల్ గార్డులు, లగేజీ ర్యాక్​తో వస్తుంది. 170 కిలోల బరువున్న ఈ అడ్వెంచర్ బైక్ టాప్ ట్రిమ్ అజూర్ బ్లూ, ఆల్పైన్ సిల్వర్ అనే రెండు విభిన్న కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దీని ధర రూ .185,800 (ఎక్స్-షోరూమ్).

హీరో ఎక్స్​పల్స్ 210: బేస్ వేరియంట్​..

హీరో ఎక్స్​పల్స్​ 210 బైక్​ బేస్ వేరియంట్ మరింత సరసమైన వర్షెన్! దీని ధర రూ .175,800 (ఎక్స్-షోరూమ్). అయితే, ఈ బేస్ వేరియంట్ టాప్ ట్రిమ్​లో లభించే అన్ని యాక్ససరీలను కోల్పోతుంది. ఇందులో ఎల్​సీడీ ఇన్​స్ట్రుమెంట్ క్లస్టర్, స్మార్ట్​ఫోన్ కనెక్టివిటీ ఉండదు! బేస్ మోడల్ టాప్ వేరియంట్ డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ మాదిరిగా కాకుండా సింగిల్-ఛానల్ ఏబీఎస్, దాని కోసం మూడు వేర్వేరు సెట్టింగులతో వస్తుంది. దీని బరువు 168 కిలోలు.

హీరో ఎక్స్​పల్స్​ 210- ఇంజిన్​..

ఈ అడ్వెంచర్ మోటార్ సైకిల్​లో 210 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది గరిష్టంగా 24.6 బీహెచ్​పీ పవర్, 20.7 ఎన్ఎమ్ పీక్​ టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ట్రాన్స్​మిషన్ డ్యూటీ కోసం, ఇంజిన్ 6-స్పీడ్ గేర్ బాక్స్​తో కనెక్ట్​ చేసి ఉంటుంది.

హీరో మోటోకార్ప్ తన ప్రీమియం శ్రేణి ద్విచక్ర వాహనాలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. కొత్తగా లాంచ్ చేసిన ఎక్స్​పల్స్ 210 ఆ వ్యూహంలో కీలక భాగం! దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఉత్పత్తి లైనప్​లో ఈ ఎక్స్​పల్స్ 210, హీరో ఎక్స్​పల్స్ 200 4వీ పైన ప్లేస్​ చేసి ఉంటుంది.

రెండు వేరియంట్లలో లభ్యమవుతున్న హీరో ఎక్స్​పల్స్ 210 రానున్న కాలంలో కంపెనీ అమ్మకాల సంఖ్యను పెంచుతుందని భావిస్తున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం