హీరో ఎక్స్‌పల్స్ 210, ఎక్స్‌ట్రీమ్ 250ఆర్ బుకింగ్ తేదీ వచ్చేసింది.. కావాలనుకుంటే అలర్ట్‌గా ఉండండి-hero xpulse 210 and here xtreme 250r booking date revealed check out details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  హీరో ఎక్స్‌పల్స్ 210, ఎక్స్‌ట్రీమ్ 250ఆర్ బుకింగ్ తేదీ వచ్చేసింది.. కావాలనుకుంటే అలర్ట్‌గా ఉండండి

హీరో ఎక్స్‌పల్స్ 210, ఎక్స్‌ట్రీమ్ 250ఆర్ బుకింగ్ తేదీ వచ్చేసింది.. కావాలనుకుంటే అలర్ట్‌గా ఉండండి

Anand Sai HT Telugu

Hero Xpulse 210, Xtreme 250R Booking Date : హీరో ఎక్స్‌పల్స్ 210, ఎక్స్‌ట్రీమ్ 250ఆర్ బుకింగ్ తేదీని ప్రకటించారు. ఎప్పటి నుంచి బుక్ చేసుకోవచ్చో ఇక్కడ తెలుసుకోండి.

హీరో ఎక్స్‌పల్స్ 210, హీరో ఎక్స్‌ట్రీమ్ 250ఆర్ బుకింగ్ ప్రారంభం

హీరో మోటోకార్ప్ ఇటీవల విడుదల చేసిన హీరో ఎక్స్‌పల్స్ 210, ఎక్స్‌ట్రీమ్ 250ఆర్ బుకింగ్ తేదీని ప్రకటించింది. 2025 ఆటో ఎక్స్‌పోలో ఎక్స్‌పల్స్ 210ని రూ.1.76 లక్షలకు, ఎక్స్‌ట్రీమ్ 250ఆర్‌ను రూ.1.80 లక్షలకు విడుదల చేశారు. ఈ రెండు బైక్‌ల బుకింగ్స్ ఫిబ్రవరిలో ప్రారంభం కావాల్సి ఉండగా, మార్చి నుంచి డెలివరీలు ప్రారంభం కావాల్సి ఉండేది. అయితే హీరో ఇప్పుడు ఎక్స్‌పల్స్ 210, ఎక్స్‌ట్రీమ్ 250ఆర్‌లను మార్చి 20, 2025 నుండి బుకింగ్ చేయడం ప్రారంభించబోతోంది. మార్చి చివర్‌లో లేదా ఏప్రిల్‌లో డెలివరీలు ప్రారంభం కావచ్చు.

హీరో ఎక్స్‌పల్స్ 210

హీరో ఎక్స్‌పల్స్ 210 స్కూటర్ 210 సిసి ఇంజన్ ను కలిగి ఉంది. ఇది గరిష్టంగా 24.26 బిహెచ్‌పీ పవర్, 20.7 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌లో ఆర్‌ఎస్‌యూ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, మోనోషాక్ రియర్ సస్పెన్షన్, డిస్క్ బ్రేక్స్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, బ్లూటూత్ ఉన్నాయి. ఇది కాకుండా ఈ బైక్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, నావిగేషన్‌తో కూడిన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా కలిగి ఉంది.

హీరో ఎక్స్‌పల్స్ 210 మోటర్ సైకిల్ లాంగ్ ట్రావెల్ ఫంట్ ఫోర్క్స్‌తో ఉంటాయి. ఫ్రంట్‌లో 210ఎంఎం సస్పెన్షన్ ట్రావెల్ ఫోర్క్, రేర్‌లో 205ఎంఎం బ్రేక్ వస్తాయి. ఫ్రంట్ అండ్ రేర్‌లో డిస్క్ బ్రేక్ డ్యూటీస్ ఉంటాయి.

హీరో ఎక్స్‌ట్రీమ్ 250ఆర్

మరోవైపు హీరో ఎక్స్‌ట్రీమ్ 250ఆర్ బైక్ ప్రత్యేకమైన హెడ్ ల్యాంప్ డిజైన్, గోల్డెన్ ఫినిషింగ్‌లో యూఎస్‌డీ ఫోర్కులు, స్కిప్టెడ్ ఫ్యూయల్ ట్యాంక్, స్ప్లిట్ సీట్లు, అప్ స్వెప్ట్ ఎగ్జాస్ట్, రియర్ టైర్ హగ్గర్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఈ బైక్ 249.03 సిసి, సింగిల్ సిలిండర్, లిక్విడ్-కూల్డ్ డిఓహెచ్‌సీ ఇంజిన్‌తో పనిచేస్తుంది. గరిష్టంగా 30 బీహెచ్పీ శక్తిని, 25 ఎన్ఎమ్ గరిష్ట టార్‌ను ఉత్పత్తి చేస్తుంది. హీరో ఎక్స్‌ట్రీమ్ 250ఆర్ చాలా కీలకమైన బైక్ అవుతుంది. ఎందుకంటే ఇది పనితీరు, శైలితో ఆకట్టుకునే ఉంటుంది.

రెండు బైక్‌లు కొత్త 4.2 అంగుళాల టీఎఫ్‌టీ కన్సోల్‌ను పరిచయం చేస్తాయి. ఇది కస్టమర్‌ అనుభవాన్ని మరింత మెరుగుపరచడంలో సహాయపడే మరో ప్రీమియం టచ్. ఈ యూనిట్ టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్/ఎస్ఎంఎస్ అలర్ట్ కోసం ఆధునిక కనెక్టివిటీ ఆప్షన్స్‌తో ఉంటాయి.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

సంబంధిత కథనం