తక్కువ ధరలో వచ్చే విడా వీఎక్స్2 ఎలక్ట్రిక్ స్కూటర్.. మిడిల్ క్లాస్ వాళ్లకు బెస్ట్!-hero vida vx2 electric scooter review this ev best for middle class people know top things ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  తక్కువ ధరలో వచ్చే విడా వీఎక్స్2 ఎలక్ట్రిక్ స్కూటర్.. మిడిల్ క్లాస్ వాళ్లకు బెస్ట్!

తక్కువ ధరలో వచ్చే విడా వీఎక్స్2 ఎలక్ట్రిక్ స్కూటర్.. మిడిల్ క్లాస్ వాళ్లకు బెస్ట్!

Anand Sai HT Telugu

అతితక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేందుకు చూస్తున్నారా? అయితే మీ కోసం హీరో విడా వీఎక్స్2 ఈవీ ఎదురుచూస్తోంది. దీని వివరాలేంటో తెలుసుకుందాం..

హీరో విడా వీఎక్స్2

హీరో విడా వీఎక్స్2 ఈ స్కూటర్ ఇటీవలే విడుదలైంది. ఇది అత్యుత్తమ డిజైన్, ఫీచర్లను కలిగి ఉంది. సరసమైన ధరకు అందుబాటులో ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ స్టాండర్డ్, బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్(BaaS) ప్లాన్‌ల కింద కస్టమర్లు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. కొత్త విడా వీఎక్స్2 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర, స్పెసిఫికేషన్ల గురించి చూద్దాం..

ధరలు

హీరో విడా వీఎక్స్2 ఇ-స్కూటర్ వీఎక్స్2 అండ్ వీఎక్స్2 ప్లస్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. స్టాండర్డ్ విడా వీఎక్స్2 గో వేరియంట్ ధర రూ.99,000, విడా వీఎక్స్2 ప్లస్ ధర రూ.1.10 లక్షలు. అదేవిధంగా బాస్ ప్లాన్ కింద విడా వీఎక్స్2 గో ధర రూ.59,000, విడా వీఎక్స్2 ప్లస్ ధర రూ.64,000 (ఎక్స్-షోరూమ్).

రేంజ్ ఎంత?

కొత్త విడా వీఎక్స్2 గో ఎలక్ట్రిక్ స్కూటర్ 2.2 కిలోవాట్ (kWh) బ్యాటరీ ప్యాక్ ఎంపికను కలిగి ఉంది. ఇది పూర్తి ఛార్జ్‌పై 92 కి.మీ వరకు ప్రయాణించగలదు. విడా వీఎక్స్2 ప్లస్ ఈ స్కూటర్ 3.4 కిలోవాట్ (kWh) బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఇది పూర్తి ఛార్జ్‌పై 142 కి.మీ వరకు ప్రయాణించగలదు.

ఛార్జింగ్ టైమ్

హీరో విడా వీఎక్స్2 ఈ స్కూటర్ బ్యాటరీ ప్యాక్ ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించి 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ కావడానికి కేవలం 1 గంట సమయం పడుతుంది. సాధారణ ఛార్జర్‌ని ఉపయోగించి అదే మొత్తాన్ని ఛార్జ్ చేయడానికి దాదాపు 6 గంటలు పడుతుంది.

ఫీచర్లు

కొత్త విడా వీఎక్స్2 ఎలక్ట్రిక్ స్కూటర్ మరింత అధునాతన డిజైన్‌ను కలిగి ఉంది. ఇది చాలా మంచి హెడ్‌లైట్, డీఆర్ఎల్‌లతో ఆకర్షిస్తుంది. ఇది గ్రే, బ్లూ, రెడ్ ఎల్లో, బ్లాక్ సహా 7 రంగులలో కూడా లభిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎల్‌సీడీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, జీపీఎస్ ట్రాకింగ్, రిమోట్ ఇమ్మొబిలైజేషన్, క్లౌడ్ కనెక్టివిటీ, అండర్-సీట్ స్టోరేజ్, రియర్ పిలియన్ బ్యాక్‌రెస్ట్, డైమండ్-కట్ ఫినిష్ అల్లాయ్ వీల్స్ వంటి వివిధ లక్షణాలతో వస్తుంది. ఇది రైడర్ రక్షణ కోసం డిస్క్ బ్రేక్‌లను కూడా కలిగి ఉంటుంది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.