Best selling two wheelers: 2022-23లో అత్యధికంగా అమ్ముడుబోయిన బైక్స్ ఇవే..-hero splendor to honda activa best selling two wheelers in india in 202223 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Hero Splendor To Honda Activa: Best Selling Two Wheelers In India In 2022-23

Best selling two wheelers: 2022-23లో అత్యధికంగా అమ్ముడుబోయిన బైక్స్ ఇవే..

HT Telugu Desk HT Telugu
Apr 28, 2023 09:25 PM IST

Best selling two wheelers: 2022 - 23 ఆర్థిక సంవత్సరంలో భారత్ లో అత్యధికంగా అమ్ముడుబోయిన బైక్స్ లో హీరో స్ప్లెండర్ (Hero Splendor) ప్రథమ స్థానంలో ఉంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Best selling two wheelers: 2022 - 23 ఆర్థిక సంవత్సరంలో భారత్ లో అత్యధికంగా అమ్ముడుబోయిన ద్విచక్ర వాహనాల జాబితాను సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యాన్యుఫాక్చరర్స్ (Society of Indian Automobile Manufacturers SIAM) శుక్రవారం విడుదల చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Best selling two wheelers: స్ప్లెండర్, యాక్టివా..

ఈ జాబితాలో ప్రథమ స్థానంలో హీరో స్ప్లెండర్ (Hero Splendor) ఉంది. భారతీయులు అత్యంత విశ్వసించే బైక్ అయిన హీరో స్ప్లెండర్ (Hero Splendor) 2022 - 23 లో మొత్తం 32.56 లక్షల యూనిట్లు అమ్ముడుపోయింది. ఈ జాబితాలో రెండో స్థానంలో హోండా సంస్థ ఫేమస్ టూ వీలర్ హోండా యాక్టివా (Honda Activa) ఉంది. ఇది 21.50 లక్షల యూనిట్లు అమ్ముడుపోయింది. భారత్ లో 2022 -23 లో అత్యధికంగా అమ్ముడుపోయిన గేర్ లెస్ బైక్స్ జాబితాలో హోండా యాక్టివా ప్రథమ స్థానంలో ఉంది. 2022 -23 లో అత్యధికంగా అమ్ముడుపోయిన బైక్స్ జాబితాలో మూడో స్థానంలో హోండా సీబీ షైన్ (Honda CB Shine) ఉంది. 125 సీసీ కేటగిరీలో ఇది అత్యంత విశ్వసనీయ మోడల్ గా నిలిచింది. ఈ బైక్ 2022 -23 లో 12.09 లక్షల యూనిట్లు అమ్ముడు పోయింది. 100 సీసీ విభాగంలో కూడా ఇది షైన్ 100 పేరుతో వస్తోంది.

Best selling two wheelers: హీరో హెచ్ఎఫ్ డీలక్స్, బజాజ్ పల్సర్

2022 -23 లో అత్యధికంగా అమ్ముడుపోయిన ద్విచక్ర వాహనాల జాబితాలో హీరో హెచ్ఎఫ్ డీలక్స్ (Hero HF Deluxe) నాలుగో స్థానంలో ఉంది. ఇది 2022 -23 లో 10.52 లక్షల యూనిట్లు అమ్ముడు పోయింది. అలాగే ఈ జాబితాలో ఐదో స్థానంలో బజాజ్ ఫ్లాగ్ షిప్ మోడల్ పల్సర్ (Bajaj Pulsar) నిలిచింది. ఈ బైక్ 10.29 లక్షల యూనిట్లు అమ్ముడు పోయింది. భారతీయ ద్విచక్ర వాహనాల చరిత్రలో పల్సర్ కు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆ తరువాత స్థానాల్లో వరుసగా గేర్ లెస్ బైక్ టీవీఎస్ జూపిటర్ (TVS Jupiter), బజాజ్ ప్లాటినా (Bajaj Platina), సుజుకీ యాక్సెస్ (Suzuki Access), టీవీఎస్ ఎక్స్ ఎల్ (TVS XL), టీవీఎస్ అపాచీ (TVS Apache) ఉన్నాయి. వీటిలో 2022-23 లో టీవీఎస్ జూపిటర్ (TVS Jupiter) 7.30 లక్షల యూనిట్లు, బజాజ్ ప్లాటినా (Bajaj Platina) 5.34 లక్షల యూనిట్లు, సుజుకీ యాక్సెస్ (Suzuki Access) 4.99 లక్షల యూనిట్లు, టీవీఎస్ ఎక్స్ ఎల్ (TVS XL) 4.42 లక్షల యూనిట్లు, టీవీఎస్ అపాచీ (TVS Apache) 3.49 లక్షల యూనిట్లు అమ్ముడు పోయాయి.

Top ten two-wheelers sold in 2022-23
Top ten two-wheelers sold in 2022-23
WhatsApp channel