పది వేలతో 80 కి.మీ మైలేజీ ఇచ్చే ఈ బైక్‌ను ఇంటికి తీసుకెళ్లొచ్చు.. లోన్, ఈఎంఐ వివరాలు తెలుసుకోండి-hero splendor plus on road price down payment emi finance plan know this bike mileage and features here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  పది వేలతో 80 కి.మీ మైలేజీ ఇచ్చే ఈ బైక్‌ను ఇంటికి తీసుకెళ్లొచ్చు.. లోన్, ఈఎంఐ వివరాలు తెలుసుకోండి

పది వేలతో 80 కి.మీ మైలేజీ ఇచ్చే ఈ బైక్‌ను ఇంటికి తీసుకెళ్లొచ్చు.. లోన్, ఈఎంఐ వివరాలు తెలుసుకోండి

Anand Sai HT Telugu
Nov 12, 2024 02:00 PM IST

Hero Splendor Plus Details : భారతీయ ఆటోమెుబైల్ మార్కెట్‌లో హీరో స్ప్లెండర్ ప్లస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మైలేజీలో ఇప్పటికీ తోపుగా ఉంది. ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైజ్, ఈఎంఐ, లోన్ వివరాలు తెలుసుకుందాం..

హీరో స్ప్లెండర్​ ప్లస్​
హీరో స్ప్లెండర్​ ప్లస్​ (HT AUTO)

భారతీయులు ఎక్కువగా తక్కువ ధరతో మంచి మైలేజీ ఇచ్చే బైకుల కోసం చూస్తుంటారు. మధ్యతరగతివారికి ఎక్కువగా ఇదే ఆలోచన ఉంటుంది. ఎక్కువ మైలేజీ ఇచ్చే బైకులను కొంటే అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. అలాంటి బైకుల్లో టాప్ ప్లేస్‌లో ఉండేది హీరో స్ప్లెండర్ ప్లస్. భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందినది. అంతేకాదు.. అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్ కూడా. స్ప్లెండర్ ప్లస్ మైలేజీ, డిజైన్, ధరతో కస్టమర్లను ఆకర్శిస్తుంది. పల్లెటూరు, సిటీలోనూ ఈ బైక్ కంఫర్ట్‌గా ఉంటుంది.

మీరు తక్కువ ధరలో కొత్త బైక్ కొనాలని ఆలోచిస్తే.. హీరో స్ప్లెండర్ ప్లస్‌ గురించి ఆలోచించొచ్చు. ఈ బైక్ అల్లాయ్ వీల్, సెల్ఫ్ స్టార్ట్ వేరియంట్ ప్రారంభ ధర రూ.76,306 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. దీని ఆన్ రోడ్ ధర, ఈఎంఐతోపాటుగా ఇతర వివరాలు చూద్దాం..

దిల్లీలో స్ప్లెండర్ ప్లస్ ఆన్ రోడ్ ధర సుమారు రూ.88,500గా ఉంది. ఈ బైక్ కోసం రూ. 10,000 డౌన్ పేమెంట్ చేయెుచ్చు. 9.7 శాతం వడ్డీ రేటుతో 36 నెలలకు దాదాపు రూ. 25,00 ఈఎంఐ చెల్లించాలి. ఫైనాన్స్ ప్లాన్‌తో కొనుగోలు చేసేందుకు మంచి క్రెడిట్ స్కోర్‌ను కలిగి ఉండాలి. నగరాలు, డీలర్‌షిప్‌లను ఆధారంగా స్ప్లెండర్ ప్లస్ ఆన్ రోడ్ ధరలో మార్పు ఉంటుందని గమనించాలి.

హీరో స్ప్లెండర్ ప్లస్‌లో 97.2సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ 8.02 పీఎస్ పవర్, 8.05ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌తో 4 స్పీడ్ గేర్‌బాక్స్ వస్తుంది. ఈ బైక్ లీటరుకు 80.6 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ తెలిపింది. ఫుల్ ట్యాంక్‌ చేయిస్తే.. ఈ బైక్ 800 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. టెలిస్కోపిక్ ఫోర్క్, మెరుగైన రైడింగ్ కోసం 5 స్టెప్ ప్రీలోడ్ అడ్జస్టబుల్ ట్విన్ షాక్ సస్పెన్షన్‌ను కలిగి ఉంటుంది.

ఈ బైకులో 130 ఎంఎం డ్రమ్ యూనిట్‌తో కూడిన కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. కొత్త స్ప్లెండర్ ప్లస్.. హోండా షైన్ 100, టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్, బజాజ్ ప్లాటినా 100 వంటి బైక్‌లతో పోటీపడుతుంది. హీరో స్ప్లెండర్ ప్లస్ మిడిల్ క్లాస్ వాళ్లకి బెటర్ ఆప్షన్. రోజూవారీగా ఎక్కువ దూరం ప్రయాణం చేసేవారికి ఖర్చులను తగ్గిస్తుంది. దీని నిర్వహణ కూడా తక్కువే ఉంటుంది.

Whats_app_banner