HF Deluxe Canvas Black vs Bajaj CT 110X : ఈ రెండు బైక్స్‌లో ఏది బెస్ట్ అంటే..
HF Deluxe Canvas Black vs Bajaj CT 110X : హీరో హెచ్ఎఫ్ డీలక్స్ కాన్వాస్ బ్లాక్ వర్సెస్ బజాజ్ సీటీ 110ఎక్స్.. ఈ రెండు బైక్స్‌లో ఏది బెస్ట్?
HF Deluxe Canvas Black vs Bajaj CT 110X : హెచ్ఎఫ్ డీలక్స్ కాన్వాస్ బ్లాక్ ఎడిషన్‌ను తాజాగా లాంచ్ చేసింది హీరో మోటోకార్ప్ సంస్థ. ఆల్ న్యూ బ్లాక్ పెయింట్ స్కీమ్‌తో పాటు ట్యూబ్‌లెస్ టైర్లు, ఐ3ఎస్ స్టార్ట్/ స్టాప్ టెక్నాలజీ ఇందులో లభిస్తోంది. ఈ బైక్‌ని బజాజ్ సీటీ 110ఎక్స్‌తో పోల్చి.. ఈ రెండింట్లో ఏది బెస్ట్? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..
హీరో హెచ్ఎఫ్ డీలక్స్.. లుక్స్ అదుర్స్!
హీరో హెచ్ఎఫ్ డీలక్స్ కాన్సాస్ బ్లాక్‌లో 9.6 లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్, హాలోజెన్ హెడ్‌ల్యాంప్, ఫ్లాట్ టైప్ సీట్, సింగిల్ పీస్ గ్రాబ్ రెయిల్, బ్లాక్డ్ ఔట్ ఎగ్సాస్ట్, టెయిల్యాంప్, 5 స్పోక్ అలాయ్ వీల్స్ వస్తున్నాయి. హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ వీల్‌బేస్ 1235ఎంఎం. గ్రౌండ్ క్లియరెన్స్ 165ఎంఎం. కర్బ్ వెయిట్ 110కేజీలు.
బజాజ్ సీటీ 110ఎక్స్‌లో 11 లీటర్ స్కల్ప్టెడ్ ఫ్యూయెల్ ట్యాంక్, ప్రొటెక్టివ్ కేసింగ్‌తో కూడిన రౌండ్ హెడ్‌ల్యాంప్, ఫ్లాట్ టైప్ సింగిల్ సీట్, రేర్ కారియర్ ఉంటాయి. ఈ బైక్ వీల్‌బేస్ 1,285ఎంఎం. గ్రౌండ్ క్లియరెన్స్ 170ఎంఎం. బరువు 127కేజీలు.
ఇదీ చూడండి:- Kawasaki Ninja 300 : 2023 కవాసకి నింజా 300 లాంచ్.. కొత్త అప్డేట్స్ ఇవే!
బజాజ్ సీటీ 110ఎక్స్.. పవర్ఫుల్ ఇంజిన్..
హీరో బైక్‌లో 97.2సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్, ఫ్యూయెల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 8హెచ్‌పీ పవర్‌ను, 8.05ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
Bajaj CT 110X on road price : ఇక బజాజ్ సీటీ 100ఎక్స్‌లో 115సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్, డీటీఎస్- ఐ మోటార్ ఉంటుంది. ఇది 8.4హెచ్‌పీ పవర్‌ను, 9.81 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
ఈ బైక్స్ ధరలు ఎంతంటే..
హీరో హెచ్ఎఫ్ డీలక్స్ కాన్వాస్ బ్లాక్ ఎక్స్‌షోరూం ధర రూ. 60,760గా ఉంది. ఇక బజాజ్ సీటీ 110ఎక్స్ ఎక్స్‌షోరూం ధర రూ. 67,322గా ఉంది.
సంబంధిత కథనం