EV charging tips : మీ ‘ఈవీ’ని ఛార్జ్​ చేస్తున్నారా? ఈ తప్పులు చేయకండి..-here are the key tips on how not to charge your electric vehicle ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Here Are The Key Tips On How Not To Charge Your Electric Vehicle

EV charging tips : మీ ‘ఈవీ’ని ఛార్జ్​ చేస్తున్నారా? ఈ తప్పులు చేయకండి..

Sharath Chitturi HT Telugu
Mar 05, 2023 06:27 PM IST

EV charging tips : మీరు కొత్తగా ఎలక్ట్రిక్​ వెహికిల్​ కొన్నారా? అయితే.. ఛార్జింగ్​ విషయంలో మీరు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ఈవీని ఛార్జ్​ చేసేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదో ఇక్కడ తెలుసుకుందాము..

మీ ‘ఈవీ’ని ఛార్జ్​ చేస్తున్నారా? ఈ తప్పులు చేయకండి..
మీ ‘ఈవీ’ని ఛార్జ్​ చేస్తున్నారా? ఈ తప్పులు చేయకండి.. (Bloomberg)

EV charging tips : ఇండియాలో ఎలక్ట్రిక్​ వాహనాల విక్రయాలు జోరందుకున్నాయి. గత రెండేళ్లుగా.. ఇండియా రోడ్ల మీద ఈవీల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ధరలు కూడా తగ్గుతుండటంతో.. చాలా మంది ఈవీలవైపు మొగ్గుచూపుతున్నారు. అయితే.. ఈవీల మెయిన్​టేనెన్స్​ గురించి ఓనర్లకు తెలియడం లేదు. తెలుసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా ఛార్జింగ్​ సమయంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు? వంటివి కచ్చితంగా తెలుసుకోవాలి. ఈ నేపథ్యంలో ఈవీలను ఛార్జ్​ చేసే సమయంలో ఎలాంటి తప్పులు చేయకూడదనేది ఇక్కడ తెలుసుకుందాము..

ట్రెండింగ్ వార్తలు

ఓవర్​ఛార్జింగ్​ చేయకండి..

How to improve EV battery life : ఓవర్​గా ఛార్జ్​ చేస్తే.. ఈవీ బ్యాటరీ లైఫ్​పై ప్రభావం పడుతుంది. స్మార్ట్​ఫోన్స్​ బ్యాటరీలాగే ఇది కూడా ఉంటుంది. అందుకే.. 100శాతం ఛార్జ్​ చేయకండి. ఇంకా చెప్పాలంటే.. లిథియం- ఐయాన్​ బ్యాటరీలు 30-80శాతం రేంజ్​లో ఛార్జ్​ చేస్తే ఇంకా ఎఫెక్టివ్​గా పనిచేస్తాయి. పదేపదే 100శాతం ఛార్జ్​ చేస్తే.. బ్యాటరీపై ఒత్తిడి పడుతుంది. అందుకే.. ఫుల్​ ఛార్జింగ్​ చేయకపోవడం బెటర్​. 80శాతం ఛార్జింగ్​ ఉండెట్టు చూసుకుంటే సరిపోతుంది.

0 ఛార్జింగ్​ వచ్చేంత వరకు వాడకండి..

Electric vehicle charging tips : 100శాతం ఛార్జింగ్​ చేయడం మంచిది కాదు. అదే సమయంలో.. ఛార్జింగ్​ 0శాతం వచ్చేంత వరకు కూడా వాడటం శ్రేయస్కరం కాదు. 20శాతం చూపించినప్పుడే ఛార్జింగ్​ పెట్టడం మంచిది. అక్కడి నుంచి 80శాతం వరకు ఛార్జింగ్​ చేసుకోవచ్చు. ఇలా చేస్తే.. రీజెనరేటివ్​ బ్రేకింగ్​తో వచ్చే ఎనర్జీ కూడా స్టోర్​ అవుతుంది. ఈవీ ఛార్జింగ్​ ఖర్చులు తగ్గుతాయి.

రైడ్​ చేసిన వెంటనే ఛార్జ్​ చేయకండి..

మోటార్​కు ఎనర్జీ సప్లే చేస్తున్న క్రమంలో.. లిథియం- ఐయాన్​ బ్యాటరీ ఎక్కువ హీట్​ను ఉత్పత్తి చేస్తుంది. అప్పుడు ఛార్జ్​ చేస్తే.. బ్యాటరీ లైఫ్​ దెబ్బతింటుంది. అందుకే.. రైడ్​ ముగిసిన కనీసం 30 నిమిషాలకు ఛార్జింగ్​ పెట్టాలి.

పదే పదే ఛార్జ్​ చేయకండి..

Electric vehicles charging tips in Telugu : ఈ తప్పును చాలా మంది ఈవీ వాహనదారులు చేస్తూ ఉంటారు. మాటిమాటికి ఈవీని ఛార్జ్​ చేస్తూ పోతే.. బ్యాటరీ లైఫ్​ తగ్గిపోతుంది. క్వాలిటీ కూడా పడిపోతుంది. ప్రదర్శన దెబ్బతింటుంది. బ్యాటరీ లైఫ్​ను పెంచాలంటే.. పదేపదే ఛార్జింగ్​ చేయకూడదు. కుదిరినప్పుడల్లా ఛార్జ్​ చేయాలి.. కానీ మాటిమాటికి ఛార్జ్​ చేయకూడదు!

WhatsApp channel