Income Tax Saving Tips: ఇలా చేస్తే.. మీరు చెల్లించే ఆదాయ పన్ను తగ్గుతుంది..-here are the income tax saving tips for small and medium businesses in india ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Here Are The Income Tax Saving Tips For Small And Medium Businesses In India

Income Tax Saving Tips: ఇలా చేస్తే.. మీరు చెల్లించే ఆదాయ పన్ను తగ్గుతుంది..

HT Telugu Desk HT Telugu
Jan 04, 2023 06:53 PM IST

Income Tax Saving Tips: చట్టబద్ధంగా ఆదాయ పన్నును తగ్గించుకునే మార్గాల కోసం మన అన్వేషణ కొనసాగుతూనే ఉంటుంది. ఆదాయ పన్నును తగ్గించే కొత్త మార్గాలు కూడా వస్తూనే ఉంటాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Income Tax Saving Tips: ఖర్చులను తగ్గించుకోవడం, మానవ వనరులను, యంత్ర వనరులను సమర్ధవంతంగా వినియోగించుకోవడం, ఆధునిక సాంకేతికతను వినియోగించడం, పన్నులను తగ్గించుకోవడం తదితర మార్గాల ద్వారా వ్యాపారాల్లో లాభాలను పొందవచ్చు. చిన్న, మధ్య తరహా వ్యాపార వేత్తలు తమ ఆదాయ పన్నును చట్టబద్ధంగా తగ్గించుకునే మార్గాలివి. చిన్న చిన్న పద్ధతులు అవలంబించడం ద్వారా ఆదాయ పన్ను మొత్తాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఇవే ఆ మార్గాలు..

ట్రెండింగ్ వార్తలు

record business-related expenses: అన్ని ఖర్చులను రికార్డ్ చేయండి

వ్యాపారానికి సంబంధించిన అన్ని ఖర్చులను ప్రతీరోజు క్రమ బద్ధంగా రాసి పెట్టుకోవాలి. ఏ చిన్న ఖర్చును కూడా వదిలేయకూడదు. వ్యాపార ఖర్చుల లెక్క సరిగ్గా లేకపోతే, మీ లాభాలకు సంబంధించి ఎక్కువ పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఖర్చులను రాసి పెట్టుకోవడం వల్ల అనవసర ఖర్చులేమైనా పెడుతున్నామా? అనే విషయంలోనూ స్పష్టత వస్తుంది. దాంతో, వాటిని తగ్గించుకుని సమర్ధవంతంగా బిజినెస్ ను నిర్వహించడం సాధ్యమవుతుంది.

depreciation cost: యంత్ర సామగ్రి తరుగుదలన సరిగ్గా లెక్కించండి

రిటైల్, లేదా ఉత్పత్తి కార్మాగారాన్ని మీరు నిర్వహిస్తున్నారా? మీ బిజినెస్ లో మెషినరీని, ఇతర యంత్ర సామగ్రిని వాడుతున్నారా? అయితే, తరుగుదల గురించి మీకు తెలిసే ఉండాలి. ఆదాయ పన్ను చట్టం(Income Tax Act) ప్రకారం, ఈ ఆర్థిక సంవత్సరం కొనుగోలు చేసిన కొత్త మెషీనరీపై 20% వరకు తరుగుదల చూపించవచ్చు. ఇది రెగ్యులర్ గా ఏటా చూపించే 15% డిప్రీసియేషన్ కు అదనం. కేపెక్స్ ప్లాన్ (Capex plan) ప్రకారం కొత్త మెషీనరీని కొనుగోలు చేస్తే, ఐటీ చట్టం (Income Tax Act)లోని 35డీ(Section 35D) సెక్షన్ ప్రకారం 100% డిడక్షన్ పొందవచ్చు.

Use digital transactions: డిజిటల్ ట్రాన్సాక్షన్స్ నే చేయండి

చెల్లింపు లావాదేవీలన్నీ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ద్వారా చేయండి. ఒక రోజులో రూ. 20 వేల కు మించిన నగదు లావాదేవీల (cash transactions) పై ఆదాయ పన్ను మినహాయింపు పొందడం కుదరదు. రోజులో రూ. 20 వేల కు మించి నగదు చెల్లింపులు జరిపితే, టాక్స్ మినహాయింపు పొందలేరు. ఒకవేళ నగదు చెల్లింపు తప్పని సరైతే, రోజుకు రూ. 20 వేల లోపు పరిమితితో ఎక్కువ రోజులు చెల్లింపులు చేయండి.

Avail a business loan బిజినెస్ లోన్ తీసుకోండి

అవకాశం ఉన్న ప్రతీ చోట బిజినెస్ లోన్ తీసుకోండి. బిజినెస్ విస్తరణకు గానీ, కొత్త మెషినరీ కొనుగోలుకు కానీ ఎంఎస్ఎంఈ బిజినెస్ లోన్, లేదా స్మాల్ బిజినెస్ లోన్ తీసుకోండి. అలాగే, సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందే అవకాశాలను వదులుకోకండి. ఈ సెక్షన్ కింద పన్ను మినహాయింపు సంవత్సరానికి రూ. 1.5 లక్షల వరకు ఉంటుంది. పీపీఎఫ్, లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ తదితర పన్ను మినహాయింపు ఉన్న వాటిలో పెట్టుబడులు పెట్టండి.

WhatsApp channel