HDFC Q3 results: హెచ్ డీ ఎఫ్ సీ లాభాల్లో 13% వృద్ధి
హెచ్ డీ ఎఫ్ సీ లిమిటెడ్ () Q3 ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (Q3) లో హెచ్ డీ ఎఫ్ సీ (HDFC) నికర లాభాలు 13% వృద్ధి చెందాయి.
హౌజింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (Housing Development Finance Corporation Ltd HDFC) 2022 డిసెంబర్ తో ముగిసే ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక (Q3 FY23) ఫలితాలను ప్రకటించింది.
15,230 కోట్ల ఆదాయం
ఈ Q3 లో HDFC రూ. 3,691 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. ఇది గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (Q3 FY22) తో పోలిస్తే 13% అధికం. గత Q3 లో HDFC నికర లాభాలు రూ. 3,260 కోట్లు. అలాగే, ఈ Q3 లో HDFC రూ. 15,230 కోట్ల ఆదాయం సముపార్జించగా, గత Q3 లో అది రూ. 11, 783 కోట్లు. అంటే, గత Q3 కన్నా 29% అధిక ఆదాయాన్ని సముపార్జించింది.
HDFC నికర వడ్డీ ఆదాయం ఈ Q3 లో రూ. 4,840 కోట్లు కాగా, గత Q3 లో అది రూ. 4,284 కోట్లు. అంటే, 13% వృద్ధి. మార్కెట్ ఒడిదుడుకున నేపథ్యంలో గురువారం స్టాక్ మార్కెట్లో HDFC షేర్ ముందు రోజు క్లోజింగ్ కన్నా సుమారు 2% తక్కువకు, రూ. 2,605 వద్ద ట్రేడ్ అవుతోంది. గత సంవత్సర కాలంలో ఈ షేర్ విలువ సుమారు 4% మాత్రమే పెరగడం గమనార్హం. అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ (assets under management AUM) విషయానికి వస్తే, 2022, డిసెంబర్ 31 నాటికి సంస్థ మొత్తం AUM రూ. 7,01,485 కోట్లు. అందులో వ్యక్తిగత రుణాల వాటా సుమారు 82%.