హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓ- అలాట్​మెంట్​ ఎప్పుడు? జీఎంపీ ఎంత ఉంది?-hdb financial ipo allotment date likely today gmp steps to check status online ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓ- అలాట్​మెంట్​ ఎప్పుడు? జీఎంపీ ఎంత ఉంది?

హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓ- అలాట్​మెంట్​ ఎప్పుడు? జీఎంపీ ఎంత ఉంది?

Sharath Chitturi HT Telugu

హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓ అలాట్​మెంట్​ ఎప్పుడు? జీఎంపీ ఎంత సూచిస్తోంది? లిస్టింగ్​ ఎప్పుడు? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓ (Photo: Company Website)

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అనుబంధ సంస్థ అయిన హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)కు బలమైన డిమాండ్ కనిపించింది. ఈ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ జూన్ 25న ప్రారంభమై జూన్ 27తో ముగిసింది. ఇప్పుడు, పెట్టుబడిదారుల దృష్టి హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓ అలాట్‌మెంట్ తేదీపై పడింది. ఇది నేడు, జూన్ 30న అలాట్​మెంట్​ స్టేటస్​ లైవ్​ అయ్యే అవకాశం ఉంది. అలాగే, జులై 2న ఐపీఓ లిస్టింగ్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓ అలాట్‌మెంట్ స్టేటస్ ఎలా చెక్​ చేసుకోవాలి?

కంపెనీ త్వరలోనే హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓ అలాట్‌మెంట్ స్టేటస్‌ను ఖరారు చేయనుంది. అలాట్‌మెంట్ ఖరారైన తర్వాత, అర్హత కలిగిన అలాట్‌మెంట్ హోల్డర్ల డీమ్యాట్ ఖాతాలకు షేర్లను జమ చేస్తుంది. అదే రోజున, షేర్లు రాని వారికి రీఫండ్‌లను కూడా ప్రారంభిస్తుంది.

హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓ అలాట్‌మెంట్ స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ వెబ్‌సైట్‌లలో, అలాగే ఐపీఓ రిజిస్ట్రార్ అధికారిక పోర్టల్‌లో చెక్​ చేసుకోవచ్చు. ఎంయూఎఫ్‌జీ ఇంటిమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (లింక్ ఇంటిమ్) హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓ రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తోంది.

బీఎస్‌ఈలో హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓ అలాట్‌మెంట్ స్టేటస్​ని ఇలా చెక్​ చేసుకోండి:

  • https://www.bseindia.com/investors/appli_check.aspx లింక్‌లో బీఎస్‌ఈ వెబ్‌సైట్‌ను సందర్శించండి
  • ‘ఇష్యూ టైప్’లో ‘ఈక్విటీ’ని ఎంచుకోండి.
  • ‘ఇష్యూ నేమ్’ డ్రాప్‌డౌన్ మెనులో ‘హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్’ను ఎంచుకోండి.
  • అప్లికేషన్ నంబర్ లేదా పాన్ నంబర్ ఏదో ఒకటి ఎంటర్ చేయండి.
  • ‘ఐ యామ్ నాట్ రోబోట్’ (I am not robot) టిక్ చేసి, ‘సెర్చ్’పై క్లిక్ చేయండి.
  • మీ హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓ అలాట్‌మెంట్ స్టేటస్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

ఎన్‌ఎస్‌ఈలో హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓ అలాట్‌మెంట్ స్టేటస్​ని ఇలా చెక్​ చేసుకోండి:

https://www.nseindia.com/invest/check-trades-bids-verify-ipo-bids లింక్‌లో ఎన్‌ఎస్‌ఈ అలాట్‌మెంట్ స్టేటస్ పేజీని సందర్శించండి

‘ఈక్విటీ అండ్ ఎస్ఎంఈ ఐపీఓ బిడ్స్’ను ఎంచుకోండి.

‘ఇష్యూ నేమ్’ డ్రాప్‌డౌన్ మెనులో ‘హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్’ను ఎంచుకోండి.

మీ పాన్ నంబర్, అప్లికేషన్ నంబర్‌ను ఎంటర్ చేయండి.

‘సబ్మిట్’పై క్లిక్ చేయండి.

మీ హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓ అలాట్‌మెంట్ స్టేటస్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓ జీఎంపీ..

అన్‌లిస్టెడ్ మార్కెట్‌లో హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు నేడు మంచి గ్రే మార్కెట్ ప్రీమియం (జీఎంపీ)తో సానుకూల ధోరణిని చూపుతున్నాయి. మార్కెట్ నిపుణుల ప్రకారం, హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓ జీఎంపీ నేడు ఒక షేర్‌కు రూ. 57గా ఉంది. దీని అర్థం, ఈ ఐపీఓ షేర్లు వాటి ఇష్యూ ధర కంటే ఒక్కో షేర్‌కు రూ. 57 ఎక్కువ ధర వద్ద ట్రేడ్ అవుతున్నట్టు!

నేటి జీఎంపీ ప్రకారం, అంచనా వేసిన లిస్టింగ్ ధర ఒక్కో షేర్‌కు రూ. 797గా ఉండవచ్చు. ఇది ఐపీఓ ధర రూ. 740 కంటే 7.7% ప్రీమియంను సూచిస్తుంది.

హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ వివరాలు..

హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓకు బిడ్డింగ్ జూన్ 25 బుధవారం ప్రారంభమై జూన్ 27 శుక్రవారంతో ముగిసింది. ఈ ఐపీఓ ధరల బ్యాండ్ ఒక్కో షేర్‌కు రూ. 740గా నిర్ణయించారు. ఐపీఓ మొత్తం సైజు రూ. 12,500 కోట్లు. ఇందులో రూ. 2,500 కోట్ల విలువైన 3.38 కోట్ల ఈక్విటీ షేర్ల ఫ్రెష్ ఇష్యూ, రూ. 10,000 కోట్ల విలువైన 13.51 కోట్ల షేర్ల ఆఫర్-ఫర్-సేల్ ఉన్నాయి.

ఎన్‌ఎస్‌ఈలోని ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ డేటా ప్రకారం, హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓ మొత్తం 16.69 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. ఆఫర్‌లో ఉన్న 13.04 కోట్ల ఈక్విటీ షేర్లకు గాను 217.67 కోట్ల ఈక్విటీ షేర్లకు బిడ్లు వచ్చాయి.

రిటైల్ విభాగంలో 5.72 రెట్లు, క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్ విభాగంలో 55.47 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ విభాగం 9.99 రెట్లు సబ్‌స్క్రిప్షన్ పొందింది.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం