two EPF UANs: మీకు ఈపీఎఫ్ఓ కు సంబంధించి రెండు యూఏఎన్ లు ఉన్నాయా? ఇలా మెర్జ్ చేయండి!
Two EPF UANs merge: ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ కు సంబంధించి ఒకటికి మించి యూఏఎన్ లు ఉన్నవారు వాటిని విలీనం చేసుకోవడం మంచిది. యూఏఎన్ లను ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్ సైట్ www.epfindia.gov.in లో సింపుల్ స్టెప్స్ ను అనుసరించడం ద్వారా సులభంగా విలీనం చేయవచ్చు.
Two EPF UANs merging: సాధారణంగా ఒకటికి మించిన ఉద్యోగాలు చేసిన వారికి కొన్ని సందర్భాల్లో ఒకటికి మించిన యూనివర్సల్ అకౌంట్ నంబర్ లేదా యూఏఎన్ లు ఉండవచ్చు. అలాంటి సమస్య ఉన్న వ్యక్తి తన యూఏఎన్ లను నిర్వహించడం ఎలా అన్నది ఇక్కడ వివరిస్తాం..
ఒకటే యూఏఎన్ ఉండాలి..
ఈపీఎఫ్ పథకం నిబంధనల ప్రకారం, ప్రతి ఉద్యోగికి ఒక్కో సంస్థలో ప్రత్యేక మెంబర్ ఐడీ ఉండవచ్చు. కానీ, ప్రతి వ్యక్తికి ఒక యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) మాత్రమే అనుమతించబడుతుంది. ఒకవేళ, మీకు రెండు వేర్వేరు యుఏఎన్ ను ఉన్నందున, మీరు యుఏఎన్ లు, పీఎఫ్ ఖాతాలను విలీనం చేయాల్సి ఉంటుంది. ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో ఆన్లైన్లో ఈ ప్రక్రియ చేపట్టవచ్చు. ఒకవేళ, మీ ప్రస్తుత సంస్థలో పిఎఫ్ కోసం ఎలాంటి నిబంధన లేనట్లైతే, మీరు క్లెయిమ్ దాఖలు చేయడం ద్వారా మీ పిఎఫ్ ఖాతాలలో ఉన్న బ్యాలెన్స్ ను ఉపసంహరించుకోవాలి. కానీ, కేవలం ఒక యూఏఎన్ పిఎఫ్ ఖాతాకు సంబంధించి మాత్రమే క్లెయిమ్ దాఖలు చేయవచ్చు. కాబట్టి, మీరు మొదట యుఎఎన్ ను విలీనం చేయాలి.
యూఏఎన్ ల విలీనం
మీ మొదటి ఉద్యోగ సమయంలో తెరిచిన ఖాతా నుండి బ్యాలెన్స్ ను (ఎస్టాబ్లిష్మెంట్ ఏ) ఫారం 13 దాఖలు చేయడం ద్వారా ఆ తరువాత చేసిన ఉద్యోగం (ఎస్టాబ్లిష్మెంట్ బీ) లో తెరిచిన పీఎఫ్ (employee provident fund) ఖాతాకు బదిలీ చేయాలి. యూఏఎన్ విలీనం కోసం మీరు మునుపటి యుఏఎన్ ను విలీనం చేయాల్సిన యుఎఎన్ క్రెడెన్షియల్స్ తో సైన్ ఇన్ చేసిన తర్వాత ఇపిఎఫ్ఓ వెబ్సైట్ లో 'ఒక సభ్యుడు, ఒకే ఈపీఎఫ్ ఖాతా (one member and one EPF account)' ఎంచుకోవాలి. ఆ తరువాత, మీ పీఎఫ్ ఖాతాల బదిలీకి ఎస్టాబ్లిష్ మెంట్ ఏ లేదా ఎస్టాబ్లిష్ మెంట్ బి ఆన్ లైన్ లో ఆమోదం పొందాల్సి ఉంటుంది. పీఎఫ్ ఖాతాల్లోని బ్యాలెన్స్ బదిలీ అయిన తర్వాత, మీ పాస్ బుక్ లో అది ప్రతిబింబిస్తుంది. ఆ తర్వాత, మీరు పీఎఫ్ బ్యాలెన్స్ ను ఉపసంహరించుకోవడానికి క్లెయిమ్ దాఖలు చేయవచ్చు.
పీఎఫ్ మొత్తం పన్ను పరిధిలోకి వస్తుందా?
మీరు ఉపసంహరించిన మొత్తంపై, లేదా ఈపీఎఫ్ లో ఉన్న బ్యాలెన్స్ పై పన్ను విధించడం అనేది మీ ఉద్యోగ కాలంపై ఆధారపడి ఉంటుంది. మీ నిరంతర ఉద్యోగ కాలం ఐదు సంవత్సరాల కంటే తక్కువగా ఉంటే మీ పీఎఫ్ ఉపసంహరణకు పన్ను మినహాయింపు లభించదు. అటువంటి పరిస్థితిలో, ఈపీఎఫ్ఓ (EPFO) మీకు చెల్లించాల్సిన మొత్తంపై టిడిఎస్ (TDS) ను మినహాయిస్తుంది. మిగిలిన మొత్తాన్ని మీకు చెల్లిస్తుంది.
టాపిక్