రూ.7500లోపు ధరలో వచ్చే ఈ పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్లు చూశారా? ఓ లుక్కేయండి-have you seen these powerful smartphones priced under 7500 rupees take a look ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  రూ.7500లోపు ధరలో వచ్చే ఈ పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్లు చూశారా? ఓ లుక్కేయండి

రూ.7500లోపు ధరలో వచ్చే ఈ పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్లు చూశారా? ఓ లుక్కేయండి

Anand Sai HT Telugu

అతి తక్కువ ధరలో పవర్‌ఫుల్ ఫోన్ కొనాలని చూస్తే మీకోసం మార్కెట్‌లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ల ధర రూ.7500లోపే. వీటిలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని చూడొచ్చు.

ప్రతీకాత్మక ఫొటో

మీరు ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లో శక్తివంతమైన పనితీరు కలిగిన స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే మీ కోసం మూడు ఆప్షన్స్ గురించి చెబుతాం. వర్చువల్ ర్యామ్ సపోర్ట్‌తో ఈ ఫోన్లు వస్తాయి. ఈ ఫోన్ల ధర రూ.7500లోపే. ఈ ఫోన్లలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని చూడొచ్చు. అలాగే ఈ ఫోన్లు బెస్ట్ ఇన్ క్లాస్ డిస్‌ప్లే, ప్రాసెసర్‌తో వస్తాయి. వీటి గురించి తెలుసుకుందాం.

ఐటెల్ జెనో 10

ఐటెల్ ఫోన్ 4జీబీ ర్యామ్ ప్లస్64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌గా ఉంది. అమెజాన్ ఇండియాలో ఈ ఫోన్ ధర రూ.6,499. ఆక్టాకోర్ ప్రాసెసర్‌పై పనిచేసే ఈ ఫోన్‌లో ఫోటోగ్రఫీ కోసం 8 మెగాపిక్సెల్ ఏఐ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్లో డైనమిక్ బార్‌తో 6.6 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే అందించనున్నారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో ఇచ్చారు. బయోమెట్రిక్ భద్రత కోసం కంపెనీ ఈ ఫోన్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందిస్తోంది.

టెక్నో స్పార్క్ గో 1

టెక్నోకు చెందిన ఈ ఫోన్లో 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. 4 జీబీ వర్చువల్ ర్యామ్‌ను కంపెనీ అందిస్తోంది. అమెజాన్‌లో ఈ ఫోన్ ధర రూ.7299గా ఉంది. ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే 6.67 అంగుళాల డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను ఇందులో అందించనున్నారు. ఈ ఫోన్లో ఫోటోగ్రఫీ కోసం 13 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది. సెల్ఫీ కెమెరా 8 మెగాపిక్సెల్. బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది.

లావా యువ 4

ఫోన్ ధర రూ.6,999గా ఉంది. ఇందులో 4 జీబీ వర్చువల్ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఇచ్చారు. ఈ ఫోన్‌ యూనిసోక్ టీ606 ప్రాసెసర్‌ను అందించారు. ఫోన్ ప్రధాన కెమెరా 50 మెగాపిక్సెల్. ఇందులో 6.56 అంగుళాల డిస్‌ప్లే, ఇది 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.