GSTN: జీఎస్టీ చెల్లింపుదారులకు అలర్ట్; అక్టోబర్ 1 నుంచి అందుబాటులోకి ఇన్ వాయిస్ మేనేజ్మెంట్ సిస్టమ్
గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (GST) చెల్లింపుదారులకు అలర్ట్. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఇన్ వాయిస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ను జీఎస్టీఎన్ అందుబాటులోకి తీసుకు రానుంది. జీఎస్టీ పోర్టల్ లో ఉండే ఈ సిస్టమ్ ద్వారా జీఎస్టీ చెల్లింపుదారులు వారి సప్లయర్ల ఇన్వాయిస్ తో పోల్చుకుని పొరపాట్లు లేకుండా చూసుకోవచ్చు.
జీఎస్టీ నెట్వర్క్ అక్టోబర్ 1వ తేదీ నుంచి ఇన్వాయిస్ మేనేజ్మెంట్ సిస్టమ్ (IMS) ను ప్రవేశపెడుతుంది. ఇది పన్ను చెల్లింపుదారులకు వారి రికార్డులు, ఇన్ వాయిస్ లను వారి సరఫరాదారులు జారీ చేసిన వాటితో సరిపోల్చడంలో సమర్ధవంతంగా సహాయపడుతుంది.
ఇన్ వాయిస్ లతో గందరగోళం లేకుండా..
పన్ను చెల్లింపుదారులు ఈ పోర్టల్ ద్వారా తమ సరఫరాదారులతో ఇన్వాయిస్ దిద్దుబాట్లు / సవరణలను సులభంగా చేసుకోవచ్చు. ఇందుకోసం పోర్టల్లో కొత్త కమ్యూనికేషన్ ప్రక్రియను తీసుకువస్తున్నారు. జీఎస్టీ చెల్లింపుదారులు సరైన ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC) పొందడానికి వీలుగా వారి సరఫరాదారులు జారీ చేసిన ఇన్ వాయిస్ లతో వారి రికార్డులు / ఇన్ వాయిస్ లను ఇది సరిపోల్చుతుంది. తద్వారా పన్ను చెల్లింపుదారులు సరైన ఐటీసీ పొందగలరు.
అక్టోబర్ 1 నుంచి..
జీఎస్టీఎన్ ఇన్ వాయిస్ మేనేజ్ మెంట్ సిస్టమ్ (GSTN IMS) అని పిలిచే ఈ ఐఎంఎస్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉందని, అక్టోబర్ 1 నాటికి జీఎస్టీ పోర్టల్ లో ఇది అందుబాటులోకి వస్తుందని జీఎస్టీఎన్ వెల్లడించింది. ఈ సిస్టమ్ లో పన్ను చెల్లింపుదారులు తమ ప్రపోజల్స్ ను పెండింగ్ లో ఉంచడానికి వీలు కల్పిస్తుంది. ఈ ఐఎంఎస్ అక్టోబర్ 1 నుంచి పన్ను చెల్లింపుదారులకు అందుబాటులో ఉంటుంది. ‘‘దీని ద్వారా గ్రహీతలు ఆమోదించిన ఇన్ వాయిస్ లు మాత్రమే వారి అర్హత కలిగిన ఐటీసీ (itc) గా వారి జీఎస్టీఆర్ -2 బీ లో భాగం అవుతాయి. అందువల్ల వారు అందుకున్న ఇన్ వాయిస్ ల వాస్తవికత, ప్రామాణికతను సమీక్షించడానికి ఐఎంఎస్ పన్ను చెల్లింపుదారులకు అవకాశాన్ని అందిస్తుంది. సరఫరాదారులు జీఎస్టీఆర్ 1/ ఐఎఫ్ఎఫ్ / 1ఎ / అదే ఇన్వాయిస్ ను జీఎస్టీఆర్ 1 / ఐఎఫ్ఎఫ్ / 1ఎ / లో సేవ్ చేసిన తర్వాత, అదే ఇన్వాయిస్ గ్రహీత యొక్క ఐఎంఎస్ డ్యాష్ బోర్డులో ప్రతిబింబిస్తుంది’’ అని జీఎస్టీఎన్ వివరించింది. ఐఎంఎస్ తో ఒక బలమైన ఆడిట్ ట్రయల్ రూపొందుతుందని మూర్ సింఘి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రజత్ మోహన్ వ్యాఖ్యానించారు. జీఎస్ టీ (GST) ఆడిట్ ల సమయంలో ఇది చాలా ఉపయోగపడుతుందన్నారు.