GST collection: మార్చి నెలలో జీఎస్టీ వసూళ్లలో మరో రికార్డు
GST collection: గూడ్స్ అండ్ సర్వసెస్ టాక్స్ (GST) వసూళ్లు ప్రతీ నెల కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ఈ మార్చి నెలలో జీఎస్టీ (GST) వసూళ్లు మరోసారి రూ. 1.5 లక్షల కోట్ల మార్క్ ను దాటేశాయి.
GST collection: రూ. 1.60 లక్షల కోట్లు..
దేశవ్యాప్తంగా ఈ ఆర్థిక సంవత్సరం చివరి నెల మార్చిలో జీఎస్టీ (GST) వసూళ్లు రూ. 1, 60,122 కోట్లకు చేరాయి. ఇది ఈ ఆర్థిక సంవత్సరంలో రెండో అత్యధిక మొత్తం. గత ఆర్థిక సంవత్సరం మార్చి నెలలో వసూలైన జీఎస్టీ (GST) కన్నా ఈ ఆర్థిక సంవత్సరం మార్చి నెలలో 13% ఎక్కువగా జీఎస్టీ (GST) వసూలయింది. ఈ మార్చిలో వసూలైన రూ. 1, 60,122 కోట్ల జీఎస్టీలో రూ. 29,546 కోట్లు సీజీఎస్టీ (CGST) కాగా, రూ. 37,314 కోట్లు ఎస్ జీఎస్టీ (SGST). అలాగే, రూ. 82,907 కోట్లు ఐజీఎస్టీ (IGST). ఐజీఎస్టీ (IGST)గా వసూలైన రూ. 82,907 కోట్లలో రూ. 42,503 కోట్లు ఇంపోర్ట్ () డ్యూటీ. రూ. 10,355 కోట్లు సెస్(cess).
GST collection: అత్యధిక ఐజీఎస్టీ వసూళ్లు
ఈ ఆర్థిక సంవత్సరంలో మార్చి నెలలోనే అత్యధికంగా ఐజీఎస్టీ (IGST) వసూలైంది. జీఎస్టీ (GST) రిటర్న్ ఫైలింగ్స్ మార్చి నెలలో అత్యధికంగా జరిగాయి. మొత్తం మీద 2022 -23 ఆర్థిక సంవత్సరంలో రూ. 18.10 లక్షల కోట్ల జీఎస్టీ (GST) వసూలైంది. అంటే, సగటును ప్రతీ నెల రూ. 1.51 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది.