GST collections: రికార్డులు సృష్టిస్తున్న జీఎస్టీ వసూళ్లు; జనవరి నెలలో ఎంతంటే?-gst collection at 1 55 lakh crore rupees in january 2023 second highest ever in the gst history ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Gst Collection At 1.55 Lakh Crore Rupees In January 2023, Second Highest-ever In The Gst History

GST collections: రికార్డులు సృష్టిస్తున్న జీఎస్టీ వసూళ్లు; జనవరి నెలలో ఎంతంటే?

HT Telugu Desk HT Telugu
Jan 31, 2023 11:32 PM IST

GST collections: ఈ సంవత్సరం జనవరి నెలలో వసూలు చేసిన గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్(GST) వివరాలను మంగళవారం ఆర్థిక శాఖ వెల్లడించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (MINT_PRINT)

GST collections in January: ఈ సంవత్సరం జనవరి నెలలో రికార్డు స్థాయిలో జీఎస్టీ (GST) వసూళ్లు చోటు చేసుకున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. జనవరి నెలలో రూ. 1.55 లక్షల కోట్లకు పైగా జీఎస్టీ (GST) వసూలు అయినట్లు తెలిపింది. ఇది ఇప్పటి వరకు వసూలైన రెండో అత్యధిక మొత్తం అని వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి నాటికి మొత్తం జీఎస్టీ (GST) రెవెన్యూ గత సంవత్సరం ఇదే కాలానికి వసూలైన జీఎస్టీ కన్నా 24% అధికమని తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు

GST collections in January: రికార్డు స్థాయిలో జీఎస్టీ రిటర్నులు

జనవరి 31 సాయంత్రం ఐదు గంటల వరకు దేశవ్యాప్తంగా మొత్తం రూ. 1,55,922 కోట్ల జీఎస్టీ (GST) వసూలైందని ఆర్థిక శాఖ మంగళవారం ప్రకటించింది. ఇందులో సీజీఎస్టీ (CGST) రూ 28,963 కోట్లు కాగా, ఎస్ జీఎస్టీ (SGST) రూ. 36,730 కోట్లు. ఇవి కాకుండా ఐ జీఎస్టీ వసూళ్లు రూ. 79,599 కోట్లు. ఐజీఎస్టీలో (IGST) దిగుమతి పన్ను రూపేణా వసూలైన రూ. 37,118 కోట్లు కూడా ఉన్నాయి. ఇవి కాకుండా, సెస్ (cess) రూపేణా వసూలైన మొత్తం రూ. 10,630 కోట్లు. మొత్తంగా, ఈ ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ (GST) వసూళ్లు రూ. 1.50 లక్షల కోట్ల మైలు రాయిని దాటడం ఇది మూడో సారి. అలాగే, ఈ జనవరి నెల రెండో అత్యధిక జీఎస్టీ వసూళ్లు సాధించిన నెలగా రికార్డు సాధించింది. ఇప్పటివరకు అత్యధిక జీఎస్టీ వసూలైన నెల 2022 ఏప్రిల్. ఆ నెలలో మొత్తం రూ. 1.68 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది. ప్రభుత్వం, ఇతర సంబంధిత వర్గాల కృషి కారణంగా జీఎస్టీ రిటర్నుల (GSTR-3B) సంఖ్య, ఇన్ వాయిస్ స్టేట్ మెంట్స్ (GSTR-1) సంఖ్య గణనీయంగా పెరిగిందని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. 2022 అక్టోబర్ - డిసెంబర్ త్రైమాసికంలో రికార్డు స్థాయిలో 2.42 కోట్ల జీఎస్టీ రిటర్నులు (GSTR-3B) దాఖలయ్యాయి.

WhatsApp channel