రూ.20తో ఈ ఎలక్ట్రిక్ టూ వీలర్ మీద 130 కి.మీ వెళ్లొచ్చు.. చాలా బరువునూ మోయగలదు!-gravton quanta electric motorcycle launched with 130 km range on single charge know amazing features of this ev ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  రూ.20తో ఈ ఎలక్ట్రిక్ టూ వీలర్ మీద 130 కి.మీ వెళ్లొచ్చు.. చాలా బరువునూ మోయగలదు!

రూ.20తో ఈ ఎలక్ట్రిక్ టూ వీలర్ మీద 130 కి.మీ వెళ్లొచ్చు.. చాలా బరువునూ మోయగలదు!

Anand Sai HT Telugu
Dec 01, 2024 02:30 PM IST

Gravton Quanta Electric Motorcycle : భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు రోజురోజుకు డిమాండ్ ఎక్కువ అవుతోంది. దీంతో ప్రముఖ కంపెనీలు సైతం ఈ మార్కెట్‌పై కన్నేస్తున్నాయి. గ్రావ్‌టన్ మోటర్స్ కూడా కొత్త ఎలక్ట్రిక్ టూ వీలర్‌ను మార్కెట్లోకి తెచ్చింది.

గ్రావ్‌టన్ మోటర్స్ కొత్త ఈవీ
గ్రావ్‌టన్ మోటర్స్ కొత్త ఈవీ

దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. తెలంగాణలో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న Gravton Motors దేశంలోని ప్రముఖ ఈవీ స్టార్టప్ కంపెనీ. గ్రావ్‌టన్ మోటార్స్ తన ఫ్లాగ్‌షిప్ మోడల్ గ్రావ్‌టన్ క్వాంటాను విడుదల చేసింది. ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న ఈ ఎలక్ట్రిక్ టూ వీలర్ అనేక ఫీచర్లతో మార్కెట్లోకి ప్రవేశించింది. దీని డిజైన్ పెద్ద మోపెడ్ మాదిరిగానే ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ టూ వీలర్ ధర రూ.1.2 లక్షలుగా ఉంది.

అయితే అంతకుముందు గ్రావ్‌టన్ ఎలక్ట్రిక్ టూ వీలర్ సరికొత్త రికార్డు సృష్టించింది. కన్యాకుమారి నుంచి ఖర్దుంగ్ లా వరకు 4,011 కి.మీల దూరాన్ని వాహనాన్ని ఛార్జ్ చేయడానికి ఆపకుండా ప్రయాణించారు. దీంతో ఈ ఎలక్ట్రిక్ టూవీలర్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ వాహనం 164 గంటల 30 నిమిషాల్లో అంటే 6.5 రోజుల్లో ఈ దూరం ప్రయాణించింది. ఇంతకు ముందు ఏ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం ఈ ఘనత సాధించలేదు.

గ్రావ్‌టన్ క్వాంటా ఎలక్ట్రిక్ టూ వీలర్ బ్యాటరీని స్వాపింగ్ ఆర్మ్ ఉపయోగించి ఛార్జ్ చేయవచ్చు. ఛార్జ్ అయిపోయిన ప్రతిసారీ పూర్తిగా ఛార్జ్ చేయబడిన బ్యాటరీతో భర్తీ చేయవచ్చు. వివిధ రైడర్‌లతో వరుసగా 3400 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత బృందం మనాలిలో మొదటిసారి ఆగింది.

ఈ బ్యాటరీ ప్యాక్‌ను పొందిన మొదటి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం ఇదే. గ్రావ్‌టన్ క్వాంటా ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యంతో వస్తుంది. బ్యాటరీని 90 నిమిషాల్లో 80 శాతం ఛార్జ్ చేయవచ్చు. ప్రత్యామ్నాయంగా బ్యాటరీ టైమింగ్ స్టేషన్ల ద్వారా పూర్తిగా ఛార్జ్ చేసిన బ్యాటరీని ఇన్‌స్టాల్ చేయవచ్చు. ఈ ఎలక్ట్రిక్ టూవీలర్ ఛార్జ్ చేయడానికి 2.7 యూనిట్ల విద్యుత్ మాత్రమే అవసరం.

అంటే 130 కి.మీ దూరం వెళ్లేందుకు 20 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. అదే మీరు పెట్రోల్ ద్విచక్రవాహనాన్ని ఉపయోగిస్తే 130 కి.మీ దూరం ప్రయాణించడానికి కనీసం చాలా ఇందనం ఖర్చు చేయాలి. అది కూడా మంచి మైలేజీ ఉన్న బైక్ అయితేనే.

గ్రావ్‌టన్ క్వాంటా ఎలక్ట్రిక్ టూ వీలర్ కాంపాక్ట్ డిజైన్‌ను కలిగి ఉంది. అధిక లోడ్ మోసే సామర్థ్యంతో దీనిని రూపొందించారు. 265 కిలోల వరకు బరువు మోయగలదు. ఇది టీవీఎస్ ఎక్స్ఎల్ లాగా పనిచేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను పూర్తిగా భారతదేశంలోనే తయారు చేశారు.

Whats_app_banner