Samsung Galaxy S21 FE: 30 వేల లోపే సామ్సంగ్ ప్రీమియం ఫోన్
Samsung Galaxy S21 FE: సామ్సంగ్ సక్సెస్ ఫుల్ మోడల్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎస్ 21 ఎఫ్ఈ (Samsung Galaxy S21 FE) ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ (Flipkart Big Saving Days) సేల్ లో రూ. 30 వేల లోపే లభిస్తోంది. ఈ సేల్ మే 10వ తేదీతో ముగుస్తోంది.
Samsung Galaxy S21 FE: అందుబాటు ధరలో ప్రీమియం ఫీచర్స్, క్వాలిటీ ఉన్న స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా? మీ కోసమే.. ఈ ఆఫర్. అన్ని అత్యాధునిక ఫీచర్స్ ఉన్న సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 21 ఎఫ్ఈ (Samsung Galaxy S21 FE) స్మార్ట్ ఫోన్ ను రూ. 30 వేల లోపే సొంతం చేసుకోవచ్చు. ఈ రోజుతో ముగిసే ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ (Flipkart Big Saving Days) లో ఇది అందుబాటులో ఉంది.
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy S21 FE: 5 జీ ఫోన్
సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 21 ఎఫ్ఈ (Samsung Galaxy S21 FE) 5 జీ సర్వీస్ ను సపోర్ట్ చేస్తుంది. 128 జీబీ స్టోరేజ్ ఫెసిలిటీ ఉన్న Samsung Galaxy S21 FE ఒరిజినల్ ధర రూ. 74999. కానీ, ఈ ఫోన్ ను ఇప్పుడు Flipkart Big Saving Days సేల్ లో రూ. 29,999 లకే పొందవచ్చు. వివిధ డిస్కౌంట్స్, క్యాష్ బ్యాక్ ఆఫర్స్, బ్యాంక్ ఆఫర్స్ ద్వారా ఈ రేటును పొందవచ్చు. ఈ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ ఇప్పుడు 60% డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. అంటే, దాదాపు 45 వేల రూపాయల తగ్గింపును ఈ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తోంది. దాంతో రూ. 74999 ల విలువైన ఫోన్ రూ. 29,999 లకే లభిస్తుంది.
Samsung Galaxy S21 FE: ఎక్స్ చేంజ్ ఆఫర్..
గెలాక్సీ ఎస్ 21 ఎఫ్ఈ (Samsung Galaxy S21 FE) పై ఫ్లిప్ కార్ట్ లో Flipkart Big Saving Days సందర్భంగా ఎక్స్ చేంజ్ ఆఫర్ కూడా ఉంది. మీ వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్ ను ఎక్స్ చేంజ్ చేయడం ద్వారా రూ. 28000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అయితే, మీ వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్ బ్రాండ్, మోడల్ ను బట్టి ఎక్స్ చేంజ్ డిస్కౌంట్ మారుతుంది. అదనంగా, ఈ ఫోన్ ను Flipkart Axis Bank Card ద్వారా కొనుగోలు చేస్తే 5% డిస్కౌంట్ తో పాటు, సర్ప్రైజ్ క్యాష్ బ్యాక్ కూపన్ కూడా లభిస్తుంది.