Online payment fraud:సైబర్ మోసాలకు అడ్డుకట్ట; ఆన్ లైన్ పేమెంట్స్ కు 4 గంటల విండో పీరియడ్; పేమెంట్ ను వెనక్కు తీసుకోవచ్చు
Online payment fraud: పెరిగిపోతున్న ఆన్ లైన్ పేమెంట్స్ మోసాలను అరికట్టడానికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా త్వరలో రూ. 2 వేలకు మించిన ఆన్ లైన్ పేమెంట్స్ పై 4 గంటల విండో పీరియడ్ ను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.
Online payment fraud: ఆన్ లైన్ పేమెంట్స్ మోసాలు దేశవ్యాప్తంగా పెరిగిపోతున్నాయి. విద్యాధికులు సైతం ఈ ఆన్ లైన్ ఫ్రాడ్ బారిన పడుతున్నారు. ఏటా కోట్లాది రూపాయలను ఈ ఫ్రాడ్ స్టర్స్ దోచుకుంటున్నారు. ఈ మోసాలను అరికట్టడానికి ప్రభుత్వం రూ. 2 వేలకు మించిన ఆన్ లైన్ పేమెంట్స్ పై 4 గంటల విండో (4-hour window) పీరియడ్ ను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.
తొలి ట్రాన్సాక్షన్ పై మాత్రమే..
ఆన్‌లైన్ పేమెంట్ మోసాలను అరికట్టడానికి ఇద్దరు వినియోగదారుల మధ్య తొలిసారి జరిగే డిజిటల్ ట్రాన్సాక్షన్ కు 4 గంటల విండో పీరియడ్ (4-hour window) ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అంటే, ఆ 4 గంటల వ్యవధిలో ఆ ట్రాన్సాక్షన్ ను చెల్లింపుదారుడు వెనక్కు తీసుకోవచ్చు. లేదా మోడిఫై చేయవచ్చు. అంటే, తాను పంపించే మొత్తంలో మార్పు చేయవచ్చు. తద్వారా, వారు మోసపోకుండా ఉంటారు. రూ. 2 వేల పై జరిగే మొదటి ట్రాన్సాక్షన్ కే ఈ 4 గంటల విండో పీరియడ్ ఉంటుంది. ఈ సదుపాయం యూపీఐ, ఆన్ లైన్ బ్యాంకింగ్, ఐఎంపీఎస్, ఆర్టీజీఎస్ తదితర చెల్లింపు విధానాలకు వర్తిస్తుంది.
ఇప్పుడున్న నిబంధన
ప్రస్తుతం, ఒక వినియోగదారు కొత్త యూపీఐ ఖాతాను సృష్టించినట్లయితే, వారు మొదటి 24 గంటల్లో గరిష్టంగా రూ. 5,000 మాత్రమే పంపించగలరు. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (NEFT) ద్వారా అయితే, లబ్ధిదారుని యాక్టివేషన్ తర్వాత, 24 గంటల లోపు రూ. 50,000 (పూర్తిగా లేదా భాగాలుగా) మాత్రమే పంపించడానికి వీలు అవుతుంది.
రూ. 30 వేల కోట్లు
ఈ ఆన్ లైన్ మోసాల ద్వారా 2022 -23 ఆర్థిక సంవత్సరంలో వినియోగదారులు 13,530 మోసపూరిత లావాదేవీల ద్వారా రూ. 30,252 కోట్ల రూపాయలను కోల్పోయారని ఆర్బీఐ వెల్లడించింది. వీటిలో 49% అంటే, 6,659 లావాదేవీలు డిజిటల్ పేమెంట్ విధానంలోనే జరిగాయి.
హెల్ప్ లైన్ నంబర్
సైబర్ మోసాల బారిన పడిన వారికి తక్షణ సహాయం అందించడానికి ఈ సంవత్సరం భారత ప్రభుత్వం ఒక హెల్ప్ లైన్ ను, ఒక రిపోర్టింగ్ ప్లాట్ ఫామ్ ను ఏర్పాటు చేసింది. సైబర్ మోసానికి గురైన వినియోగదారులు 155260 హెల్ప్ లైన్ నంబర్ కు ఫోన్ చేసి అవసరమైన సహాయం పొందవచ్చు. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C), ఆర్బీఐ, అన్ని ప్రధాన బ్యాంకులు, పేమెంట్స్ బ్యాంకులు, వాలెట్లు మరియు ఈ కామర్స్ సంస్థల సమన్వయంతో ఈ హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేశారు.
టాపిక్