Govt nudges LIC for better investor return: LIC కి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శనం-govt nudges lic to tweak product strategy for better investor return ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Govt Nudges Lic To Tweak Product Strategy For Better Investor Return

Govt nudges LIC for better investor return: LIC కి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శనం

HT Telugu Desk HT Telugu
Oct 26, 2022 10:32 PM IST

Govt nudges LIC for better investor return: ప్రభుత్వ రంగంలోని అతిపెద్ద బీమా సంస్థ Life Insurance Corporation(LIC)ని లాభాల బాట పట్టించే దిశగా వ్యూహాలను మార్చాలని సంస్థ యాజమాన్యానికి కేంద్ర ప్రభుత్వం సూచించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (AFP)

కేంద్ర ఆర్థిక శాఖ పర్ఫార్మెన్స్ రివ్యూ సందర్భంగా LIC కి పలు సూచనలు చేసింది. ముఖ్యంగా ఇన్వెస్టర్ల పెట్టుబడులకు మరిన్ని లాభాలు వచ్చేలా వ్యహాలను మార్చాలని దిశానిర్దేశం చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Govt nudges LIC for better investor return: నష్టాల్లోనే LIC షేరు

ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించిన నాటి నుంచి LIC షేరు నష్టాల్లోనే కొనసాగుతోంది. నిజానికి LIC ఐపీఓ కు భారీ స్పందన లభించింది. ఇన్వెస్టర్లు భారీ లాభాలను ఆశించారు. కానీ, తొలి రోజు నుంచీ LIC షేరు విలువ దిగజారుతూనే ఉంది. మే 17న LIC షేరు ఇష్యూ ధర రూ. 949 కాగా, మంగళవారం అది రూ. 595.50 వద్ద ట్రేడ్ అయింది.

Govt nudges LIC for better investor return: ప్రభుత్వం రివ్యూ

ఈ నేపథ్యంలో, కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం LIC పనితీరును సమీక్షించింది. గరిష్టంగా లాభాలను అర్జించేలా ప్రొడక్ట్ స్ట్రాటెజీని మార్చుకోవాలని ఈ సందర్భంగా LIC యాజమాన్యానికి సూచించింది.

Govt nudges LIC for better investor return: వచ్చే సంవత్సరం పెరిగే అవకాశం

అయితే, LIC షేరు ధర వచ్చే సంవత్సరం భారీగా పెరిగే అవకాశం ఉందని ఫారిన్ బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. సంస్థకు మీడియం టర్మ్ మార్కెట్ పొటెన్షియాలిటీ ఉందని, అస్సెట్ వాల్యూ క్రమంగా పెరుగుతోందని, మార్కెట్ హై ఆపరేటింగ్ రెవెన్యూ ఉందని తెలిపాయి. అందువల్ల వచ్చే సంవత్సరం LIC షేరు విలువ రూ. 1000 కి చేరే అవకాశముందని ఒక అంతర్జాతీయ నివేదిక పేర్కొంది.

WhatsApp channel