Small savings schemes interest rates : చిన్న పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లను పెంచిన ప్రభుత్వం
Small savings schemes interest rates changed : చిన్న పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లను పెంచింది ప్రభుత్వం. ఈ పెంచిన రేట్లు.. ఆదివారం నుంచి అమల్లోకి రానున్నాయి.
Small savings schemes interest rates : నూతన ఏడాది నేపథ్యంలో ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్‌ను అందించింది. పోస్టాఫీసు టర్మ్ డిపాజిట్లు, ఎన్ఎస్ఈ, సీనియర్ సిటిజెన్ స్కీమ్ వంటి చిన్న పొదుపు ఖాతాల వడ్డీ రేట్లను పెంచింది. ఈ పెంచిన వడ్డీ రేట్లు.. జనవరి 1 నుంచి, అంటే ఆదివారం నుంచి అమల్లోకి రానున్నాయి.
వీటిపై వడ్డీ రేట్లు పెరిగాయి..
NSC Interest rates hiked : పలు స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్‌పై 20 బేసిస్ పాయింట్ల నుంచి 110 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఫలితంగా వడ్డీ రేట్లు ఇప్పుడు 4.0శాతం నుంచి 7.6శాతం వరకు ఉన్నాయి. వరుసగా రెండో త్రైమాసికంలోనూ వడ్డీ రేట్లను ప్రభుత్వం పెంచడం విశేషం. మొత్తం మీద ఈ ఏడాది జనవరి నుంచి చూసుకుంటే.. వడ్డీ రేట్లు 1.1శాతం పాయింట్లు పెరిగినట్టు అవుతుంది.
అయితే.. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సుకన్య సంవృద్ధి యోజనలో వడ్డీ రేట్లను మార్చలేదు ప్రభుత్వం.
తాజా పెంపుతో.. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ)పై వడ్డీ రేటు 6.8శాతం నుంచి 7శాతానికి చేరింది. అదే సమయంలో.. సీనియర్ సిటిజెన్ స్కీమ్‌పై వడ్డీ రేటు.. గతంలో 7.6శాతంగా ఉండగా, ఇప్పుడది 8శాతానికి పెరిగింది. నెలవారీ ఆదాయం ఖాతాపై వడ్డీ రేటు సైతం.. 6.7శాతం నుంచి 7.1శాతానికి చేరింది.
post office saving schemes interest rates : ఇక 1-5 ఏళ్ల కాలవ్యవధి కలిగి ఉన్న పోస్టాఫీసు టర్మ్ డిపాజిట్ స్కీమ్స్‌పై వడ్డీ రేట్లు 1.1శాతం పాయింట్లు పెరిగాయి. 1 ఏడాది కాల వ్యవధి ఉన్న స్కీమ్స్‌పై వడ్డీ రేట్లు 5.5శాతం నుంచి 6.6శాతానికి చేరాయి. 2ఏళ్ల కాలవ్యవధి కలిగిన స్కీమ్స్‌పై వడ్డీ రేట్లు 5.7శాతం నుంచి 6.8శాతానికి పెరిగాయి. ఇక మూడెళ్ల కాలవ్యవధి కలిగిన పోస్టాఫీసు టర్మ్ డిపాజిట్ స్కీమ్స్‌పై వడ్డీ రేట్లు 5.8శాతం నుంచి 6.9శాతానికి చేరాయి. అదే సమయంలో 5ఏళ్ల టైమ్ డిపాజిట్ కలిగిన స్కీమ్స్‌పై వడ్డీ రేట్లు 6.9శాతం నుంచి 7శాతానికి పెరిగాయి.
PPF Interest rates : ఓ ఆర్థిక ఏడాదిలో ప్రతి మూడు నెలలకు ఒకసారి.. వడ్డీ రేట్లపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. జూన్ త్రైమాసికంలో వడ్డీ రేట్లను కేంద్రం పెంచలేదు. సెప్టెంబర్ త్రైమాసికంలో పెంచించింది. కానీ అప్పుడు కూడా పీపీఎఫ్‌పై వడ్డీ రేట్లు పెంచలేదు.
ఎఫ్డీల్లాగే.. చిన్న పొదుపు పథకాలపైనా రిస్క్ ఫ్రీ రిటర్నులు లభిస్తుంటాయి.
ఆర్బీఐ.. వడ్డీ రేట్లను పెంచడంతో, దేశవ్యాప్తంగా ఎఫ్డీలు ఆకర్షణీయంగా మారాయి. ఫలితంగా ఎఫ్‌డీల్లో పెట్టుబడులపై ప్రజలు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో.. ఎఫ్డీలపై అధిక వడ్డీలను ఇస్తున్న బ్యాంక్‌ల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం