గూగుల్ పిక్సెల్ 9ఏ స్మార్ట్‌ఫోన్ ఇటీవలే ఇండియాతో పాటు మొత్తం మీద 32 దేశాల్లో లాంచ్ అయ్యింది. టెన్సర్ జీ4 చిప్సెట్తో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ ధర కేవలం రూ.49999. హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్స్‌తో పాటు, ఈ స్మార్ట్‌ఫోన్ కొన్ని డిజైన్ అప్డేట్స్ని సైతం పొందింది., ఇది సాధారణంగా అందించే వాటికి కొంచెం భిన్నంగా ఉండటంతో గూగుల్ అభిమానుల్లో ప్రజాదరణ పొందుతోంది. అందువల్ల, మీరు ఫ్లాగ్షిప్ సామర్థ్యాల ఫీచర్లతో నిండిన, శక్తివంతమైన మిడ్-రేంజర్ కోసం వెతుకుతుంటే, గూగుల్ పిక్సెల్ 9ఏ మీకు సరైన ఆప్షన్ కావచ్చు. ఈ నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్స్, సేల్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
గూగుల్ నుంచి వస్తున్న అఫార్డిబుల్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ ఈ పిక్సెల్ 9ఏ. అయితే టెక్ దిగ్గజం తన సిగ్నేచర్ కెమెరా బార్ని తొలగించడం ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్ని కొద్దిగా మార్చింది. వాటర్- డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఐపీ68 రేటింగ్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ మరింత మన్నికైనదిగా మారింది. పిక్సెల్ 9ఏలో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2700నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.3 ఇంచ్ యాక్చువా పీఓఎల్ఈడీ డిస్ప్లే ఉంది. టైటాన్ ఎం2 సెక్యూరిటీ చిప్‌తో కనెక్ట్ చేసిన గూగుల్ టెన్సర్ జీ4 ప్రాసెసర్ ఈ స్మార్ట్‌ఫోన్ సొంతం.
పిక్సెల్ 9ఏ.. జెమినీ ఏఐ, సర్కిల్ టు సెర్చ్, మ్యాజిక్ ఎరేజర్, ఆడియో మ్యాజిక్ ఎరేజ్ వంటి అనేక గూగుల్ ఏఐ ఫీచర్లతో వస్తుంది. ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 13 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్‌తో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ముందువైపు 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అందించారు. 33వాట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5100 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.
పిక్సెల్ 9ఏ ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుండగా, గూగుల్ 7 సంవత్సరాల ఓఎస్ అప్డేట్స్, పిక్సెల్ డ్రాప్స్‌ను అందిస్తుంది.
గూగుల్ పిక్సెల్ 9ఏ రెండు కొత్త రంగుల్లో వస్తుంది. అవి పియోనీ- ఐరిస్, పోర్సిలీన్- ఒబ్సీడియన్ గూగుల్ పిక్సెల్ 9ఏ 8+128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.49,999గా ఉంది. 8జీబీ+256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.56,999గా నిర్ణయించారు. ఎంపిక చేసిన బ్యాంకింగ్ భాగస్వాములతో రూ.3,000 క్యాష్‌బ్యాక్, 24 నెలల నో-కాస్ట్ ఈఎంఐని కూడా గూగుల్ అందిస్తోంది. ఏప్రిల్ 2025 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయవచ్చు. కరెక్ట్ డేట్‌ని సంస్థ త్వరలోనే వెల్లడిస్తుంది.
సంబంధిత కథనం