Google Pixel 8a : గూగుల్​ పిక్సెల్​ 8ఏ ప్రైజ్​ డ్రాప్- డిస్కౌంట్స్​ కూడా! కొనేందుకు ఇదే రైట్​ టైమ్​..-google pixel 8a gets big price drops ahead of pixel 9a launch see all details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Google Pixel 8a : గూగుల్​ పిక్సెల్​ 8ఏ ప్రైజ్​ డ్రాప్- డిస్కౌంట్స్​ కూడా! కొనేందుకు ఇదే రైట్​ టైమ్​..

Google Pixel 8a : గూగుల్​ పిక్సెల్​ 8ఏ ప్రైజ్​ డ్రాప్- డిస్కౌంట్స్​ కూడా! కొనేందుకు ఇదే రైట్​ టైమ్​..

Sharath Chitturi HT Telugu
Published Feb 17, 2025 12:10 PM IST

Google Pixel 8a price drop : గూగుల్ పిక్సెల్ 8ఏ ఫ్లిప్​కార్ట్​లో రూ.35,000 లోపు లభిస్తోంది. పిక్సెల్ 9ఎ లాంచ్​కు ముందు అందుబాటులోకి వచ్చిన ఈ భారీ ధర తగ్గింపు వివరాల గురించి తెలుసుకోండి.

గూగుల్​ పిక్సెల్​ 8ఏ ధర తగ్గింపు..
గూగుల్​ పిక్సెల్​ 8ఏ ధర తగ్గింపు.. (Shaurya Sharma - HT)

గూగుల్​ పిక్సెల్​ 9ఏ స్మార్ట్​ఫోన్​ సంస్థ లాంచ్​ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో గూగుల్​ పిక్సెల్​ 8ఏ ధరను సంస్థ భారీగా తగ్గించింది! ప్రైజ్​ డ్రాప్​తో పాటు వివిధ ఫ్లిప్​కార్ట్​లోని డిస్కౌంట్స్​, ఆఫర్స్​తో ఈ స్మార్ట్​ఫోన్​ని మీరు ఇప్పుడు రూ. 35వేల లోపు ధరకు దక్కించుకోవచ్చు. ఈ స్మార్ట్​ఫోన్​ని కొనుగోలు చేయాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్న వారు.. ఈ బెస్ట్​ డీల్స్​ని ఉపయోగించుకోవాలి. ఈ నేపథ్యంలో గూగుల్​ పిక్సెల్​ 8ఏ డిస్కౌంట్స్​ వివరాలను ఇక్కడ చూసేయండి..

గూగుల్ పిక్సెల్ 8ఏ డిస్కౌంట్స్​..

గూగుల్​ పిక్సెల్​ 8ఏ 8జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​ వాస్తవ ధర రూ. 52,999. కానీ 28శాతం ప్రైజ్​ డ్రాప్​తో ఈ స్మార్ట్​ఫోన్​ని ఇప్పుడు రూ. 37,999కే కొనుగోలు చేసుకోవచ్చు. అంతేకాదు, ఈ కామర్స్​ డిస్కౌంట్స్​- బ్యాంక్​ ఆఫర్స్​, ఎక్స్​ఛేంజ్​ఆఫర్స్​తో గూగుల్​ పిక్సెల్​ 8ఏ ధర మరింత దిగొస్తుంది.

ఫ్లిప్​కార్ట్​ లిస్టింగ్​ ప్రకారం.. ఈ గూగుల్​ పిక్సెల్​ 8ఏ స్మార్ట్​ఫోన్​పై హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ క్రెడిట్​ కార్డు ఈఎంఐ ట్రాన్సాక్షన్స్​తో రూ. 3000 తగ్గింపు పొందొచ్చు. ఫ్లిప్​కార్ట్​ యాక్సిస్​ బ్యాంక్​ క్రెడిట్​ కార్డుతో 5శాతం క్యాష్​బ్యాక్​ కూడా పొందొచ్చు. గూగుల్​ 6ఏ వర్కింగ్​ కండీషన్​లో ఎక్స్​ఛేంజ్​ ఆఫర్​ కింద రూ. 13వేల వరకు లభిస్తుంది. ఇది లేకపోయినా, కేవలం బ్యాంక్​ డిస్కౌంట్స్​తోనే గూగుల్​ పిక్సెల్​ 8ఏని రూ. 35వేల ధరలోపు దక్కించుకోవచ్చు.

గూగుల్ పిక్సెల్ 8ఏ కొనాలా?

గూగుల్ పిక్సెల్ 9ఏ అప్​గ్రేడెడ్ ఫీచర్స్​తో వస్తుందని అంచనాలు ఉన్నప్పటికీ.. పిక్సెల్ 8ఏ కూడా.. ప్రస్తుత డిస్కౌంట్ ధరలో మంచి ఆప్షన్​గా మారింది. 6.1 ఇంచ్​ ఓఎల్ఈడీ డిస్​ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్​ పీక్ బ్రైట్​నెస్ ఉన్నాయి. పిక్సెల్ 8ఏలో 8 జీబీ ర్యామ్, గూగుల్ టెన్సర్ జీ3 చిప్​ వంటివి ఉన్నాయి. ఇది ఫ్లాగ్​షిప్ పర్ఫార్మెన్స్​, అధునాతన ఏఐ ఫీచర్లను అందిస్తుంది. ఈ స్మార్ట్​ఫోన్​ 7 ప్రైమరీ ఆండ్రాయిడ్ అప్​గ్రేడ్స్​కి కూడా అర్హత కలిగి ఉంది.

పిక్సెల్ 8ఏ స్మార్ట్​ఫోన్​లో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 13 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాలతో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. ముందువైపు 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. 4492 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ గ్యాడ్జెట్​లో ఉంది.

గూగుల్​ పిక్సెల్​ 9ఏ లాంచ్​ ఎప్పుడు?

గూగుల్​ పిక్సెల్​ 9ఏలో 6.3 ఇంచ్​ అమోలెడ్​ డిస్​ప్లే, టెన్సర్​ జీ4 ప్రాసెసర్​, ఎం3 సెక్యూరిటీ చిప్​ వంటివి ఉంటాయని లీక్స్​ సూచిస్తున్నాయి. ఇందులో 48ఎంపీ ప్రైమరీ, 13ఎంపీ అల్ట్రావైడ్​ కెమెరా సెటప్​ ఉండొచ్చు. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం ముందువైపు 13ఎంపీ కెమెరా కొనసాగవచ్చు. కానీ బ్యాటరీ మాత్రం 5100 ఎంఏహెచ్​కి అప్​గ్రేడ్​ అవ్వొచ్చు.

ఇక ఈ మచ్​ అవైటెడ్​ గూగుల్​ పిక్సెల్​ 9ఏని మార్చ్​ 26న సంస్థ లాంచ్​ చేయనున్నట్టు తెలుస్తోంది. రూ. 50వేలకు అటు, ఇటుగా దీని ధర ఉండొచ్చు. ఈ స్మార్ట్​ఫోన్​కి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే, లాంచ్​ వరకు వెయిట్​ చేయాల్సిందే!

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.
Whats_app_banner

సంబంధిత కథనం