Google Pixel 8: గూగుల్ పిక్సెల్ 8 పై ఇది నెవర్ బిఫోర్ ఆఫర్; అన్నీ కలిస్తే రూ.21 వేల తగ్గింపు-google pixel 8 gets upto rs 21000 price cut in flipkart sale ahead of pixel 9 india launch ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Google Pixel 8: గూగుల్ పిక్సెల్ 8 పై ఇది నెవర్ బిఫోర్ ఆఫర్; అన్నీ కలిస్తే రూ.21 వేల తగ్గింపు

Google Pixel 8: గూగుల్ పిక్సెల్ 8 పై ఇది నెవర్ బిఫోర్ ఆఫర్; అన్నీ కలిస్తే రూ.21 వేల తగ్గింపు

HT Telugu Desk HT Telugu
Updated Feb 03, 2025 10:30 AM IST

Google Pixel 8 price cut: తమ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ సిరీస్ పిక్సెల్ 9 ను గూగుల్ లాంచ్ చేస్తున్న నేపథ్యంలో, గూగుల్ పిక్సెల్ 8 పై అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ లో గూగుల్ పిక్సెల్ 8 విభిన్న ఆఫర్లతో కలిపి దాదాపు 21 వేల తగ్గింపు ధరకు లభిస్తుంది.

గూగుల్ పిక్సెల్ 8 పై ఇది నెవర్ బిఫోర్ ఆఫర్
గూగుల్ పిక్సెల్ 8 పై ఇది నెవర్ బిఫోర్ ఆఫర్ (Google)

Google Pixel 8 price cut: గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ లాంచ్ కు సిద్ధమవుతున్న నేపథ్యంలో, గూగుల్ పిక్సెల్ 8 ఫోన్ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ లో భారీ డిస్కౌంట్ తో అందుబాటులోకి వచ్చింది. గూగుల్ పిక్సెల్ 9 స్మార్ట్ ఫోన్ ను ఆగస్ట్ 14న లాంచ్ చేస్తున్నారు.

పిక్సెల్ 8 పై భారీ డిస్కౌంట్

గూగుల్ పిక్సెల్ 8 ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ సేల్ లో భారీ డిస్కౌంట్ తో లభిస్తుంది. ఈ ఫోన్స్ ను గూగుల్ గత సంవత్సరం లాంచ్ చేసింది. గూగుల్ ఇప్పుడు పిక్సెల్ 8 ఫోన్లను భారతదేశంలోనే తయారు చేస్తోంది. గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ లో భాగంగా గూగుల్ పిక్సెల్ 8 ప్రో కూడా ఉంది. మనదేశంలో గూగుల్ పిక్సెల్ 8 లాంచ్ సమయంలో రూ.75,999 ఉండగా, పిక్సెల్ 9 లాంచ్ కు ముందు గూగుల్ పిక్సెల్ 8ను రూ.54,999కే కొనుగోలు చేయవచ్చు. వీటితో పాటు కొనుగోలుదారులు బ్యాంక్ ఆఫర్లను కూడా పొందవచ్చు.

గూగుల్ పిక్సెల్ 8: బ్యాంక్ ఆఫర్లు, డిస్కౌంట్లు

గూగుల్ పిక్సెల్ 8 ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో రూ.17,000 తగ్గింపు తర్వాత రూ.58,999 వద్ద లిస్ట్ అయింది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డు లావాదేవీలపై రూ.4000 తగ్గింపుతో గూగుల్ పిక్సెల్ 8 ధర రూ.54,999కు తగ్గింది. అంటే మీరు బ్యాంక్ ఆఫర్‌తో కలిపి మొత్తం 21 వేల తగ్గింపును పొందవచ్చు. మీ వద్ద పాత స్మార్ట్ఫోన్ ఉంటే, ఫ్లిప్ కార్ట్ (flipkart) మీ పాత డివైస్ కు రూ. 54,150 వరకు ఎక్స్చేంజ్ బోనస్ ను ఆఫర్ చేస్తోంది. ఇది పిక్సెల్ 8 ఫైనల్ ధరను గణనీయంగా తగ్గిస్తుంది.

గూగుల్ పిక్సెల్ 8 స్పెసిఫికేషన్లు

గూగుల్ పిక్సెల్ 8 (google pixel 8) 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో 6.2 అంగుళాల ఎఫ్ హెచ్ డీ + ఓఎఈల్డీ డిస్ప్లేను కలిగి ఉంది. 8 జీబీ ర్యామ్ తో కూడిన గూగుల్ ఇన్-హౌస్ టెన్సర్ జీ3 చిప్సెట్తో ఈ స్మార్ట్ఫోన్ పనిచేస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే గూగుల్ పిక్సెల్ 8 లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా విత్ మాక్రో ఫోకస్ ఉన్నాయి. వీడియో కాల్స్, సెల్ఫీల కోసం పిక్సెల్ 8 ముందు భాగంలో 10.5 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఇందులో 4575 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.

Whats_app_banner