Google Pixel 7a: గూగుల్ పిక్సెల్ 7ఏ స్పెసిఫికేషన్లు లీక్.. చాలా అప్‍గ్రేడ్‍లతో!-google pixel 7a specifications leaked ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Google Pixel 7a Specifications Leaked

Google Pixel 7a: గూగుల్ పిక్సెల్ 7ఏ స్పెసిఫికేషన్లు లీక్.. చాలా అప్‍గ్రేడ్‍లతో!

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 12, 2023 05:36 PM IST

Google Pixel 7a: గూగుల్ పిక్సెల్ 7ఏ స్పెసిఫికేషన్లు లీకయ్యాయి. ఈ ఏడాది విడుదల కానున్న ఈ ఫోన్ వివరాలు వెల్లడయ్యాయి.

గూగుల్ పిక్సెల్ 6ఏ
గూగుల్ పిక్సెల్ 6ఏ (HT Tech)

Google Pixel 7a Specifications: మిడ్ రేంజ్‍లో పిక్సెల్ 7ఏ (Google Pixel 7a) మొబైల్‍ను గూగుల్ (Google) ఈ ఏడాది తీసుకురానుంది. మేలో జరిగే గూగుల్ ఐ/ఓ 2023 (Google I/O 2023) ఈవెంట్‍లో ఆ సంస్థ గూగుల్ పిక్సెల్ 7ఏను విడుదల చేస్తుందని సమాచారం. పిక్సెల్ 6ఏకు సక్సెసర్‌గా ఇది రానుంది. అయితే 6ఏతో పోలిస్తే గూగుల్ పిక్సెల్ 7ఏ చాలా అప్‍‍గ్రేడ్లతో వస్తుందని తెలుస్తోంది. పిక్సెల్ 7ఏ స్పెసిఫికేషన్లు తాజాగా లీకయ్యాయి. దీంతో 6ఏతో పోలిస్తే ప్రాసెసర్ నుంచి కెమెరాల వరకు చాలా విభాగాల్లో పిక్సెల్ 7ఏ అప్‍గ్రేడ్‍గా ఉంటుందని సమాచారం బయటికి వచ్చింది. టిప్‍స్టర్ దేబయాన్ రాయ్.. ఈ స్పెసిఫికేషన్లను లీక్ చేశారు. పూర్తి వివరాలివే..

ట్రెండింగ్ వార్తలు

గూగుల్ పిక్సెల్ 7ఏ స్పెసిఫికేషన్లు (లీక్ ప్రకారం)

Google Pixel 7a Expected Specifications: 6.1 ఫుల్ హెచ్‍డీ+ 90హెర్ట్జ్ OLED డిస్‍ప్లేతో గూగుల్ పిక్సెల్ 7ఏ వస్తుందని లీక్‍ల ద్వారా వెల్లడైంది. గూగుల్ టెన్సార్ జీ2 ప్రాసెసర్ ఈ ఫోన్‍లో ఉంటుందని తెలుస్తోంది. పిక్సెల్ 6ఏ 60 హెర్ట్జ్ డిస్‍ప్లే, జీ1 ప్రాసెసర్‌ను కలిగి ఉంది.

Google Pixel 7a: గూగుల్ పిక్సెల్ 7ఏ వెనుక 64 మెగాపిక్సెల్ Sony IMX787 ప్రైమరీ, 12 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉంటాయని లీక్‍ ద్వారా వెల్లడైంది. ఇదే జరిగితే ప్రైమరీ కెమెరా విషయంలో పిక్సెల్ 6ఏ (12.2 మెగాపిక్సెల్)కు పిక్సెల్ 7ఏ అప్‍గ్రేడ్‍గా ఉంటుంది. 7ఏ ఫ్రంట్ కెమెరా గురించి వివరాలు వెల్లడి కాలేదు. ఆండ్రాయిడ్ 13తోనే ఈ ఫోన్ రానుంది.

గూగుల్ పిక్సెల్ 7ఏ (Google Pixel 7a) వైర్లెస్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుందని లీక్‍ల ద్వారా వెల్లడైంది. 5వాట్ల వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుందని తెలుస్తోంది. వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ కెపాసిటీ గురించిన సమాచారం బయటికి రాలేదు.

మరోవైపు, గతేడాది లాంచ్ అయిన గూగుల్ పిక్సెల్ 6ఏ ప్రస్తుతం రూ.30వేలలోపు ధరతోనే లభిస్తోంది. 6.1 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ 60Hz OLED డిస్‍ప్లేను పిక్సెల్ 6ఏ కలిగి ఉంది. గూగుల్ టెన్సార్ ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. గూగుల్ పిక్సెల్ 6ఏ వెనుక 12.2 మెగాపిక్సెల్ ప్రైమరీ, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాలు ఉన్నాయి. 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తోంది. 5జీ సపోర్ట్ ఉంటుంది. ఈ మొబైల్‍లో 4,410mAh బ్యాటరీ ఉండగా.. 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది.

WhatsApp channel