Google Pixel 7a: అదిరిపోయే అప్‍గ్రేడ్లతో గూగుల్ పిక్సెల్ 7ఏ!-google pixel 7a may come with huge upgrades over pixel 6a ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Google Pixel 7a May Come With Huge Upgrades Over Pixel 6a

Google Pixel 7a: అదిరిపోయే అప్‍గ్రేడ్లతో గూగుల్ పిక్సెల్ 7ఏ!

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 15, 2022 11:27 PM IST

Google Pixel 7a: గూగుల్ పిక్సెల్ 7ఏ ఫోన్‍కు సంబంధించిన కీలకమైన స్పెసిఫికేషన్లను ఓ టిప్‍స్టర్ వెల్లడించారు. వీటిని బట్టి చూస్తే.. పిక్సెల్ 6ఏ పోలిస్తే 7ఏ భారీ అప్‍గ్రేడ్లతో వస్తుందని తెలుస్తోంది.

Google Pixel 7a: అదిరిపోయే అప్‍గ్రేడ్లతో గూగుల్ పిక్సెల్ 7ఏ!
Google Pixel 7a: అదిరిపోయే అప్‍గ్రేడ్లతో గూగుల్ పిక్సెల్ 7ఏ! (Google)

Google Pixel 7a: పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రో మొబైళ్లను దిగ్గజ సంస్థ గూగుల్ ఇటీవలే లాంచ్ చేసింది. యూజర్ల నుంచి క్రిటిక్స్ వరకు అందరి మనసులను ఈ మోడల్స్ గెలుచుకున్నాయి. ఇప్పుడు ఈ సిరీస్‍లో బడ్జెట్ మోడల్‍ను గూగుల్ సిద్ధం చేస్తోంది. గూగుల్ పిక్సెల్ 7ఏను రూపొందిస్తోంది. గూగుల్ పిక్సెల్ 6ఏ (Google Pixel 6a) కు సక్సెసర్ గా ఇది రానుంది. వచ్చే ఏడాది తొలి అర్ధభాగంలో గూగుల్ పిక్సెల్ 7ఏ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఈ ఫోన్‍కు సంబంధించిన కొన్ని కీలకమైన స్పెసిఫికేషన్లు లీకయ్యాయి. వీటిని బట్టి చూస్తే 6ఏతో పోలిస్తే పిక్సెల్ 7ఏ ముఖ్యమైన అప్‍గ్రేడ్లను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

Google Pixel 7a Expected Specifications: గూగుల్ పిక్సెల్ 7ఏ అంచనా స్పెసిఫికేషన్లు

గూగుల్ పిక్సెల్ 7ఏ స్పెసిఫికేషన్లను ప్రముఖ టిప్‍స్టర్ కుబా వొజిచొస్కీ (Kuba Wojciechowski) లీక్ చేశారు. డిస్‍ప్లే, కెమెరా, చార్జింగ్ గురించి వివరాలు వెల్లడించారు. 90హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండే 1080p సామ్‍సంగ్ ప్యానెల్‍తో గూగుల్ పిక్సెల్ 7ఏ డిస్‍ప్లే ఉంటుందని తెలిపారు. దీన్ని బట్టి 6ఏ కంటే 7ఏ డిస్‍ప్లే ఎంతో అప్‍గ్రేడ్ అవుతుందని భావించవచ్చు. పిక్సెల్ 6ఏ స్టాండర్డ్ 60హెర్ట్జ్ రిఫ్రెష్‍ రేట్‍నే కలిగి ఉంది.

Google Pixel 7a Camera: పిక్సెల్ 6ఏతో పోలిస్తే గూగుల్ పిక్సెల్ 7ఏ కెమెరా విభాగంలో భారీ అప్‍గ్రేడ్‍లతో వస్తుందని ఆ టిప్‍స్టర్ వెల్లడించారు. 64 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్787 సెన్సార్‍తో పిక్సెల్ 7ఏ ప్రైమరీ కెమెరా ఉంటుందని వెల్లడించారు. 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుందని చెప్పారు. కాగా, ప్రస్తుతం అందుబాటులో ఉన్న గూగుల్ పిక్సెల్ 6ఏ 12.2 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. దీంతో పిక్సెల్ 7ఏ కెమెరా విభాగంలో మరింత మెరుగ్గా ఉంటుందని సంకేతాలు ఉన్నాయి.

Google Pixel 7a: ఆ ఫీచర్ తొలిసారి..

గూగుల్ పిక్సెల్ 7ఏ స్మార్ట్ ఫోన్ వెర్లెస్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుందని లీక్‍స్టర్ కుబా వెల్లడించారు. ఇదే జరిగితే, వెర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో రానున్న తొలి పిక్సెల్ ఏ సిరీస్ ఫోన్ ఇదే అవుతుంది. అయితే ఈ వైర్లెస్ చార్జింగ్ స్పీడ్ 5వాట్‍గా ఉంటుందన్న అంచనాలు కూడా ఉన్నాయి.

గూగుల్ పిక్సెల్ 7ఏ లాంచ్‍కు ఇంకా కొన్ని నెలల సమయం ఉంది. అప్పటి కల్లా మరింత సమాచారం వస్తూనే ఉంటుంది. మార్పులు కూడా జరగొచ్చు. ప్రస్తుతం వచ్చిన ఈ సమాచారమంతా టిప్‍స్టర్లు లీక్‍ల ద్వారా వెల్లడించినదే.

WhatsApp channel

టాపిక్