Google Pixel 7a India launch: ఇండియాలో గూగుల్ పిక్సెల్ 7ఏ లాంచ్ డేట్ ఫిక్స్!: ధర ఏ రేంజ్‍లో ఉండొచ్చంటే!
Google Pixel 7a India launch: గూగుల్ పిక్సెల్ 7ఏ ఇండియా లాంచ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ మొబైల్‍కు సంబంధించిన కొన్ని వివరాలు ఇప్పటికే లీక్ అయ్యాయి.
Google Pixel 7a India launch: టెక్ దిగ్గజం గూగుల్ (Google) నుంచి భారత మార్కెట్‍లోకి మరో స్మార్ట్ ఫోన్ రానుంది. గూగుల్ పిక్సెల్ 7ఏ మొబైల్ ఈ నెల 11వ తేదీన ఇండియాలో లాంచ్ కానుంది. ఇందుకు సంబంధించి గూగుల్ టీజ్ చేసింది. సరికొత్త ఫోన్‍ను తీసుకొస్తున్నామంటూ ట్వీట్ చేసింది. మే 10న గూగుల్ ఐ/ఓ (Google I/O 2023) లాంచ్ ఈవెంట్‍లో పిక్సెల్ 7ఏను గూగుల్ గ్లోబల్‍గా విడుదల చేస్తుందనే అంచనాలు ఉన్నాయి. మే 11న ఇండియాలో ఈ ఫోన్ అడుగుపెట్టనుంది. పిక్సెల్ 6ఏకు ఈ ఫోన్ సక్సెసర్‌గా వస్తోంది. గూగుల్ పిక్సెల్ 7ఏ గురించి ఇప్పటికే కొన్ని వివరాలు లీక్ అయ్యాయి. ధర విషయంలోనూ అంచనాలు వెలువడ్డాయి. ఆ వివరాలివే.
ట్రెండింగ్ వార్తలు
ఫ్లిప్‍కార్ట్‌లో..
Google Pixel 7a India launch: ఈనెల 11వ తేదీన తేదీన గూగుల్ పిక్సెల్ 7ఏ ఇండియాలో విడుదల కానుంది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్ (Flipkart)లో ఈ కొత్త ఫోన్ అందుబాటులో ఉంటుందని గూగుల్ తన ట్వీట్‍లో పేర్కొంది. లైట్ బ్లూ కలర్ షేడ్ కలర్ వేరియంట్‍ను టీజ్ చేసింది. ఇది అర్కిటిక్ బ్లూ అయి ఉండొచ్చు. చార్కోల్ బ్లాక్ కలర్ ఆప్షన్‍లోనూ పిక్సెల్ 7ఏ అందుబాటులోకి వస్తుందని లీక్‍ల ద్వారా వెల్లడైంది.
Google Pixel 7a Price Range: గూగుల్ పిక్సెల్ 7ఏ మొబైల్ ధర 450 డాలర్ల నుంచి 500 డాలర్ల (సుమారు రూ.35,000 నుంచి రూ.40,000) మధ్య ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. ఇండియాలోనూ దాదాపు ఇదే రేంజ్‍లో ఈ ఫోన్ రానుందని తెలుస్తోంది.
Google Pixel 7a: గూగుల్ పిక్సెల్ 7ఏ మొబైల్‍కు సంబంధించి కొన్ని స్పెసిఫికేషన్లు లీకుల ద్వారా బయటికి వచ్చాయి. 6.1 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ OLED డిస్‍ప్లేను ఈ ఫోన్ కలిగి ఉంటుందని తెలుస్తోంది. 90Hz రిఫ్రెష్ రేట్ ఉండొచ్చు. గూగుల్ టెన్సార్ జీ2 ప్రాసెసర్ ఈ మొబైల్‍లో ఉండనుంది
గూగుల్ పిక్సెల్ 7ఏ మొబైల్ వెనుక రెండు కెమెరాల సెటప్ ఉంటుంది తెలుస్తోంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ ఉండే 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుందని లీక్‍ల ద్వారా వెల్లడైంది. 10.08 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఈ పిక్సెల్ 7ఏకు ఉండే ఛాన్స్ ఉంది.
గూగుల్ పిక్సెల్ 7ఏలో 4,400mAh బ్యాటరీ ఉంటుందని అంచనాలు ఉన్నాయి. 20 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‍కు ఈ ఫోన్ సపోర్ట్ చేయొచ్చు. కాగా, లాంచ్ ఈవెంట్‍లో పిక్సెల్ 7ఏకు సంబంధించిన పూర్తి అధికారిక వివరాలను వివరాలను గూగుల్ వెల్లడించనుంది. మే 11న పూర్తి వివరాలు తెలుస్తాయి.