గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్లలో కంపెనీకి చెందిన టెన్సర్ జీ5 చిప్‌సెట్, టైటాన్ ఎం2 సెక్యూరిటీ చిప్‌లు ఉన్నాయి. ఇవి ఇన్‌బిల్ట్ క్యూఐ2 ఛార్జింగ్ మాగ్నెట్‌లను కలిగి ఉన్నాయి. పిక్సెల్ స్నాప్ మాగ్నెటిక్ ఛార్జింగ్ యాక్ససరీలకు అనుకూలంగా ఉంటాయి. ఈ ఫోన్లు ఆగస్టు 28 నుంచి గూగుల్ స్టోర్, రిటైల్ పార్ట్‌నర్స్ స్టోర్లలో అందుబాటులోకి వస్తాయి. ఈ ఫోన్లు గురించి తెలుసుకుందాం..
గూగుల్ పిక్సెల్ 10.. 6.3-అంగుళాల ఫుల్ HD+ OLED డిస్‌ప్లేను 120Hz రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 3,000 నిట్స్ బ్రైట్‌నెస్ (హై బ్రైట్‌నెస్ మోడ్‌లో 2,000 నిట్స్) కలిగి ఉంది. పిక్సెల్ 10 ప్రో లాగానే, ఇది కూడా అదే సైజు ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది, కానీ పిక్సెల్ 10 రిఫ్రెష్ రేట్ 60Hz నుండి 120Hz వరకు పరిమితం చేశారు. అయితే ప్రో మోడల్ 1Hz నుండి 120Hz వరకు పరిధిని పొందుతుంది.
కెమెరా విషయానికొస్తే.. దీనికి 48ఎంపీ ప్రైమరీ కెమెరా, 13ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్, 10.8MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ప్రైమరీ, టెలిఫోటో సెన్సార్లు రెండూ ఓఐఎస్, ఈఐఎస్ మద్దతును కలిగి ఉన్నాయి. ముందు భాగంలో 10.5MP సెల్ఫీ కెమెరా ఉంది, దీనికి ఆటోఫోకస్ ఉంది. బ్యాటరీ సామర్థ్యం 4,970ఎంఏహెచ్, ఇది 30W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, 15W Qi2 వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ 4 రంగుల ఎంపికలలో లభిస్తుంది, దీనికి ఇండిగో, ఫ్రాస్ట్, లెమన్‌గ్రాస్, అబ్సిడియన్ ఆప్షన్స్ ఉంది. 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీ ఇచ్చారు. భారతదేశంలో దీని ధర రూ.79,999 నుండి ప్రారంభమవుతుంది.
పిక్సెల్ 10 ప్రో 6.3-అంగుళాల 120Hz LTPO ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని రిజల్యూషన్ 1280 x 2856 పిక్సెల్స్. దీని గరిష్ట బ్రైట్‌నెస్ 3,300 నిట్‌లు ఉంది. పిక్సెల్ 10, పిక్సెల్ 10 ప్రో ఎక్ఎల్ లాగా, దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 రక్షణ కూడా ఉంది. పిక్సెల్ 10 ప్రోలో 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 48ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్, 48ఎంపీ టెలిఫోటో లెన్స్ (5x ఆప్టికల్ జూమ్‌తో) ఉంటాయి. మూడు వెనుక కెమెరాలు OIS, EIS లకు మద్దతు ఇస్తాయి. ముందు భాగంలో 42ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. దీనికి ఆటోఫోకస్, 103-డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఉన్నాయి. 16జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తో లాంచ్ చేశారు. భారతదేశంలో దీని ధర రూ.99,999 నుండి ప్రారంభమవుతుంది.
పిక్సెల్ 10 ప్రో ఎక్స్ఎల్ 6.8-అంగుళాల 120Hz LTPO ఓఎల్ఈడీ డిస్‌ప్లేను 1344 x 2992 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో కలిగి ఉంది. ఇది 5,200mAh బ్యాటరీని కలిగి ఉంది, ఇది 45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, 25W Qi2 వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. కెమెరా విషయానికొస్తే పిక్సెల్ 10 ప్రో ఎక్ఎల్ కెమెరా సెటప్ పిక్సెల్ 10 ప్రో మాదిరిగానే ఉంటుంది. దీనికి 42ఎంపీ సెల్ఫీ కెమెరా, ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్ ఉన్నాయి. 16జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తో తీసుకొచ్చారు. భారతదేశంలో దీని ధర రూ. 1,19,999 నుండి మెుదలవుతుంది.
పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ భారతదేశంలో గూగుల్ రెండో ఫోల్డబుల్ ఫోన్ అవుతుంది. పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్‌లో జెమిని నానో ఆన్-డివైస్ ఏఐ ఉంది. ఈ ఫోన్ 16జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తో వచ్చింది. ఈ ఫోన్ 6.4-అంగుళాల Actua ఓఎల్ఈడీ కవర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 రక్షణను పొందుతుంది. లోపలి భాగంలో ఫోన్ 8-అంగుళాల సూపర్ ఆక్టువా ఫ్లెక్స్ డిస్‌ప్లేను 1Hz నుండి 120Hz డైనమిక్ రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కలిగి ఉంది.
ఇందులో మాక్రో సపోర్ట్‌తో కూడిన 48ఎంపీ ప్రధాన కెమెరా, 10.5ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్, 5ఎక్స్ జూమ్‌తో కూడిన 10.8ఎంపీ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ముందు భాగంలో డ్యూయల్ 10ఎంపీ కెమెరాలు ఉన్నాయి. కవర్ స్క్రీన్‌పై ఒకటి, మెయిన్ స్క్రీన్‌పై ఒకటి ఉన్నాయి. గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ ధర భారతదేశంలో రూ.1,72,999గా ఉంది. దీని ప్రీ-బుకింగ్ త్వరలో ప్రారంభమవుతుంది.