గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ త్వరలోనే విడుదలకానుంది. గత సంవత్సరం పిక్సెల్ 9 సిరీస్ తరహాలోనే, ఈ సంవత్సరం కూడా ఆగస్టులోనే ఈ కొత్త ఫోన్‌లు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. 2024లో మాదిరిగానే, ఈ ఏడాది కూడా పిక్సెల్ 10, పిక్సెల్ 10 ప్రో, పిక్సెల్ 10 ప్రో ఎక్స్ఎల్, థర్డ్ జనరేషన్ గూగుల్ ఫోల్డెబుల్ ఫోన్ – పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ – వంటి అనేక మోడల్‌లు విడుదల కానున్నాయి.
కాగా పిక్సెల్ 10 సిరీస్‌లో అనేక అప్‌గ్రేడ్‌లు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న నివేదికల ఆధారంగా, గూగుల్ పిక్సెల్ 10 సిరీస్‌కి సంబంధించిన వివరాలు, అంచనాలను ఇక్కడ తెలుసుకోండి..
ఇప్పటివరకు వచ్చిన నివేదికల ప్రకారం.. గూగుల్ టీఎస్ఎంసీకు మారడం ద్వారా ఒక ప్రధాన అప్‌గ్రేడ్‌ను తీసుకురాబోతోంది. గూగుల్ పిక్సెల్ పరికరాలు ఇప్పటివరకు శామ్‌సంగ్ తయారుచేసిన టెన్సర్ చిప్‌సెట్‌లను ఉపయోగించాయి. అయితే, ఇప్పుడు గూగుల్ టీఎస్ఎంసీ ప్రాసెసర్‌ను ఉపయోగించబోతోందని అంచనా వేస్తున్నారు. పిక్సెల్ 10లో ఆశించిన టెన్సర్ జీ5 ప్రాసెసర్ టీఎస్ఎంసీ ద్వారా తయారువుతోంది. ఇది రోజువారీ పనులు, సామర్థ్యం, పవర్ వినియోగం పరంగా ప్రాసెసర్‌ల పనితీరులో ఒక ప్రధాన అప్‌గ్రేడ్‌గా నిలవవచ్చు.
ఇప్పటివరకు, గూగుల్ స్టాండర్డ్ పిక్సెల్ మోడల్‌లు పిక్సెల్ 6, పిక్సెల్ 7, పిక్సెల్ 8, పిక్సెల్ 9లలో రెండు కెమెరాల సెటప్‌తో వచ్చాయి. అయితే, గూగుల్ పిక్సెల్ 10 కోసం మూడొవ కెమెరాను అందించే అవకాశం ఉంది! ఇది టెలిఫోటో లెన్స్ అయి ఉండవచ్చు. దీనివల్ల స్టాండర్డ్ వేరియంట్ నుంచే ట్రిపుల్-కెమెరా సెటప్ అందుబాటులోకి వచ్చి, మరింత బహుముఖ కెమెరా సిస్టమ్‌ను అందిస్తుంది.
షియోమీ 15 అల్ట్రా, వివో ఎక్స్200 ప్రో వంటి కొన్ని ఫోన్‌లు టెలిఫోటో లెన్స్‌ను ఉపయోగించి మ్యాక్రో ఫోటోలను తీయడానికి అనుమతిస్తాయి. ఇది పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్, ఐఫోన్ 16 ప్రో వంటి వాటిలో ఉన్న అల్ట్రా-వైడ్ మ్యాక్రోలకు భిన్నంగా ఉంటుంది.
ఇప్పుడు, ఆండ్రాయిడ్ హెడ్‌లైన్స్ నివేదించిన దాని ప్రకారం, గూగుల్ పిక్సెల్ 10 ప్రోకి టెలిఫోటో మ్యాక్రో ఫంక్షన్‌ను తీసుకురాబోతోందని తెలుస్తోంది. దీని అర్థం, మీరు వస్తువులకు చాలా దూరంగా ఉన్నప్పటికీ మ్యాక్రో షాట్‌లను తీయగలరు. ఇది ఆసక్తికరమైన దృక్పథాన్ని అందిస్తుంది. సృజనాత్మక అవకాశాలను పెంచుతుంది.
గత సంవత్సరం పిక్సెల్ 9 సిరీస్ డిజైన్‌లో గణనీయమైన మార్పును తీసుకొచ్చింది గూగుల్. ఇందులో పిక్సెల్ ఫోన్‌లు ఫ్లాట్ ఫ్రంట్, బ్యాక్, ఫ్లాట్ సైడ్‌లకు మారాయి. ఇది ప్రస్తుత పరిశ్రమ-వ్యాప్త ట్రెండ్‌ను గుర్తుకు తెస్తుంది. ఇది ఫోన్ పైభాగంలో ఉండే ఒక డివైడ్ చేసిన కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంది. ఇది మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర ఫోన్‌లకు భిన్నంగా ప్రత్యేకమైన రూపాన్ని ఇస్తుంది.
ఇప్పటివరకు లీక్ అయిన రెండర్‌ల ఆధారంగా, పిక్సెల్ 10 సిరీస్ కూడా అదే డిజైన్ లాంగ్వేజ్‌ని కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
గూగుల్ పిక్సెల్ 10 భారతదేశంలో అధికారిక గూగుల్ స్టోర్‌లో అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
ఈ నెల ప్రారంభంలో, భారత మార్కెట్లో తన సొంత అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌ను గూగుల్ ప్రారంభించింది. ఇది వినియోగదారులు పిక్సెల్ పరికరాలను నేరుగా గూగుల్ నుంచి కొనుగోలు చేయడానికి అనుమతిస్తుంది. కాబట్టి, పిక్సెల్ 10 సిరీస్ కూడా భారతదేశంలో నేరుగా గూగుల్ నుంచి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
గూగుల్ పిక్సెల్ 10 సిరీస్‌పై మరిన్ని వివరాలు లాంచ్ టైమ్ నాటికి అందుబాటులోకి వస్తాయి.
సంబంధిత కథనం