సోషల్ మీడియాలో ఇప్పుడంతా ఏఐ ఫొటో ట్రెండ్ నడుస్తోంది! వినాయక చవితికి గణేశుడి విగ్రహాన్ని పట్టుకున్న ఇమేజ్‌లు క్రియేట్ చేసుకున్న ప్రజలు, దసరాకి దుర్గా మాత పూజ థీమ్‌తో ఫొటోలు తయారు చేసుకున్నారు. ఇక ఇప్పుడు అందరు దీపావళి కోసం ఎదురుచూస్తున్నారు. మరి మీరు కూడా దీపావళికి తగ్గట్టు రెట్రో స్టైల్ శారీ ఏఐ ఇమేజ్‌లు క్రియేట్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! గూగుల్ జెమినీ నానో బనానా టూల్‌ని ఉపయోగించి మీరు కూడా మీకు నచ్చిన విధంగా ఏఐ ఇమేజ్‌లు క్రియేట్ చేసుకోవచ్చు. అందుకు కావాల్సిన ప్రాంప్ట్‌లను కింద ఇస్తున్నాము చూసేయండి..
స్టెప్ 1- ముందుగా మీ ఫోన్ లేదా వెబ్‌బ్రౌజర్‌లో గూగుల్ జెమినీని ఓపెన్ చేయండి.
స్టెప్ 2- మీకు నచ్చిన ఫొటోను అప్లోడ్ చేయండి.
స్టెప్ 3- కింద ఇస్తున్న వివిధ ప్రాంప్ట్‌లను టైప్ చేసి, ఎంటర్ ప్రెస్ చేయండి.
స్టెప్ 4- ఏఐ ఇమేజ్‌లు జనరేట్ అవుతాయి. వాటిని డౌన్లోడ్ చేసుకుని, మీ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయండి.
సంబంధిత కథనం