Google Down : గూగుల్‌లో అంతరాయం.. పని చేయని సెర్చ్ ఆప్షన్.. ఇండియాలో కూడా అవుతుందా?
Google Down : ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఐటీకి సంబంధించిన అంతరాయాలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని రోజుల కిందట మైక్రోసాఫ్ట్ విండోస్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. తాజాగా గూగుల్ కూడా ఇలాంటి సమస్యలే ఎదుర్కొంది. అయితే ఈ సమస్య భారతదేశంలోనూ వస్తుందా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల్లో గూగుల్ సేవల్లో అంతరాయం కలిగింది. ఆన్‌లైన్ వినియోగదారులు ఇమెయిల్‌లు, సెర్చ్ ఇంజిన్, YouTube, ఇతర సేవలను యాక్సెస్ చేయలేకపోతున్నారని ఫిర్యాదు చేశారు. వినియోగదారులు భారతీయ కాలమానం ప్రకారం.. ఆగస్టు 12 (IST)న తమ కంప్యూటర్ స్క్రీన్‌లపై ఎర్రర్ ప్రాంప్ట్‌లను చూశారు. ఈ విషయం ఇతర దేశాల్లో ఉన్న వినియోగదారులు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
డౌన్‌డిటెక్టర్ అనే వెబ్‌సైట్ అంతరాయాలను పర్యవేక్షిస్తుంది. అయితే గూగుల్‌లో వచ్చిన సమస్యల ఫిర్యాదులు తర్వాత ఈ విషయాన్ని పట్టుకుంది. అమెరికా కాలమానం ప్రకారం ఉదయం పూట ఈ సమస్య ఎక్కువైంది. ప్రపంచవ్యాప్త అంతరాయాలపై కారణం ఇంకా కనుగొనలేదు. అయితే చాలా మంది అమెరికన్లు వారి పని దినాన్ని ప్రారంభించడం వలన కలవరపరిచే పరిణామంగా ఇది మారింది. 'ఆఫీస్‌లో ఇంటర్నెట్ ఎందుకు పని చేయడం లేదు అని చూశాను. కేవలం Google డౌన్ అయిందని తేలింది.' ఓ వినియోగదారుడు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
డౌన్‌డిటెక్టర్ ఈ గూగుల్ సమస్య ఎక్కువగా లాస్ ఏంజిల్స్, న్యూయార్క్ నగరాల్లో ఉందని మ్యాప్‌ను చూపించింది. అదే సమయంలో హ్యూస్టన్, శాన్ ఫ్రాన్సిస్కో, డల్లాస్, బోస్టన్, చికాగోలో తక్కువగా సమస్యలు ఉన్నాయి. USలో అత్యధికంగా గూగుల్‌లో వచ్చిన వచ్చిన ఇబ్బందులు చూస్తే.. 57 శాతం సెర్చ్ సమస్యలు వచ్చాయి. 31 శాతం వెబ్‌సైట్ సమస్యను సూచించాయి. 11 శాతం Google డ్రైవ్ సమస్యలు వచ్చాయి.
UK, యూరప్, ఆసియా, దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ సమస్యతో వినియోగదారులు విసుగు చెందారు. దీంతో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్‌లో పోస్టులు చేయడం మెుదలుపెట్టారు. 'గూగుల్ డౌన్‌లో ఉంటే Googleలోనే వెతుకుతున్నాను.' అని కొందరు పోస్టులు చేస్తున్నారు.
వచ్చిన అనేక ఫిర్యాదులలో Chrome PC యాప్ పని చేయడం లేదని కొందరు చెబుతున్నారు. తమ సమస్యలు పరిష్కారమయ్యాయని కొందరు తర్వాత చెప్పుకొచ్చారు. మరికొందరేమో ఇంకా సమస్య కొనసాగుతుందని పోస్టులు పెట్టారు.
వినియోగదారులు కొన్ని రకాల సమస్యలు గూగుల్‌లో వస్తున్నాయని చెప్పారు. గూగుల్ సేవల్లో అంతరాయం, వెబ్ లాగిన్ పేజీ పని చేయకపోవడం. Chromeలో లాగిన్ పేజీని మళ్లీ లోడ్ చేయడం, ఖాళీ పేజీని లోడ్ చేస్తుండటం, గూగుల్ సెర్చ్ ఇంజన్ లోడ్ అవ్వడంలాంటి సమస్యలు చెప్పుకొచ్చారు. అయితే ఇండియాలో కూడా ఇలాంటి సమస్యలు వస్తాయా అని కొందరు ప్రశ్నిస్తున్నారు.