Google deletes your Gmail: మీ జీమెయిల్ ను, యూట్యూబ్ అకౌంట్ ను గూగుల్ డిలీట్ చేసే చాన్స్ ఉంది; వెంటనే ఇలా చేయండి..
Google deletes your Gmail: టెక్ దిగ్గజం గూగుల్ తన జీమెయిల్ యూజర్లకు ఇటీవల ఒక హెచ్చరిక జారీ చేసింది. ఆ హెచ్చరికకు వెంటనే స్పందించనట్లైతే, వారి జీమెయిల్ ఖాతాతో పాటు యూట్యూబ్ అకౌంట్ ను కూడా డిలీట్ చేస్తామని స్పష్టం చేసింది.
Google deletes your Gmail: టెక్ దిగ్గజం గూగుల్ తన జీమెయిల్ యూజర్లకు ఇటీవల ఒక హెచ్చరిక జారీ చేసింది. ఆ హెచ్చరికకు వెంటనే స్పందించనట్లైతే, వారి జీమెయిల్ ఖాతాతో పాటు యూట్యూబ్ అకౌంట్ ను కూడా డిలీట్ చేస్తామని స్పష్టం చేసింది.
రెండేళ్లు దాటితే..
యాక్టివ్ గా లేని జీమెయిల్ ఖాతాలను తొలగించాలని గూగుల్ నిర్ణయించింది. రెండేళ్లుగా ఎలాంటి కార్యకలాపాలు లేని, రెండేళ్లుగా సైన్ ఇన్ () కాని జీమెయిల్ ఖాతాలను తొలగిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇటీవల తమ బ్లాగ్ లో వెల్లడించింది.త్వరలో ఈ తొలగింపు కార్యక్రమం చేపడ్తామని తెలిపింది. అందువల్ల, ఇప్పటివరకు తమ జీమెయిల్ ఖాతాలను ఇనాక్టివ్ గా ఉంచినవారు, ఆ ఖాతాలు తమకు అవసరమని భావిస్తే, వెంటనే, వాటిని యాక్టివేట్ చేసుకోవాలని గూగుల్ సూచించింది. ఈ సూచనలతో యూజర్లకు మెయిల్స్ ను పంపడం కూడా ప్రారంభించింది.
ఇనాక్టివ్ ఖాతాలపై దృష్టి
యాక్టివ్ గా లేని (inactive) జీమెయిల్ (GMail), యూట్యూబ్ (Youtube) ఖాతాలను గుర్తించే పనిలో ప్రస్తుతం గూగుల్ ఉంది. 2023 డిసెంబర్ నుంచి ఇనాక్టివ్ ఖాతాల తొలగింపు ప్రారంభమవుతుందని స్పష్టం చేసింది. యాక్టివ్ గా లేని జీమెయిల్, యూట్యూబ్ ఖాతాలను తొలగించడం ద్వారా అనవసర భారాన్ని తగ్గించుకోవడంతో పాటు, భద్రతపరమైన సమస్యలను తగ్గించుకోవచ్చని గూగుల్ భావిస్తోంది. ఆయా ఇనాక్టివ్ ఖాతాలను డిలీట్ చేస్తే, ఆయా అకౌంట్లలోని మెయిల్స్, ఫొటోస్, డాక్యుమెంట్స్, డ్రైవ్, మీట్, క్యాలెండర్, యూట్యూబ్ ల్లోని సమాచారం సహా మొత్తం కంటెంట్ అంతా డిలీట్ అవుతుంది.
దశల వారీగా తొలగింపు..
ఇనాక్టివ్ ఖాతాల తొలగింపు ప్రక్రియను దశలవారీగా చేపడ్తామని గూగుల్ వెల్లడించింది. అకౌంట్ ను క్రియేట్ చేసిన తరువాత, ఒక్కసారి కూడా యూజ్ చేయని ఖాతాలను మొదట డిలీట్ చేస్తామని వివరించింది. డిలీట్ చేసే ముందు, ఆ అకౌంట్ కు, అలాగే, ఆ అకౌంట్ తో పాటు ఉన్న రికవరీ అకౌంట్ కు డిలీట్ చేయబోతున్నామని హెచ్చరిస్తూ మెయిల్స్ పంపిస్తామని తెలిపింది. అయితే, వ్యక్తిగత జీమెయిల్ ఖాతాలకు మాత్రమే ఈ తొలగింపు వర్తిస్తుందని, వ్యాపార సంస్థలు, పాఠశాలలకు సంబంధించిన జీమెయిల్ ఖాతాలను తొలగించబోమని స్పష్టం చేసింది.
మీ జీమెయిల్ డిలీట్ కావద్దంటే ఏం చేయాలి?
ఇనాక్టివ్ గా ఉన్న మీ జీమెయిల్ ఖాతా డిలీట్ కాకూడదనుకుంటే, ముందుగా ఈ పనులు చేయండి.
- వెంటనే ఆ ఇనాక్టివ్ ఖాతాను యాక్టివేట్ చేయండి.
- టూ ఫాక్టర్ ఆథెంటికేషన్ ను యాక్టివేట్ చేయండి.
- ఆ అకౌంట్ నుంచి ఎవరికైనా మెయిల్ చేయండి.
- గూగుల్ డ్రైవ్ ను ఉపయోగించండి.
- ఆ అకౌంట్ తో అనుసంధానమై ఉన్న యూట్యూబ్ అకౌంట్ ను ఓపెన్ చేసి, వీడియోలు ఏవైనా చూడండి.
- గూగుల్ సెర్చ్ ను వాడండి.
- ఆ గూగుల్ మెయిల్ తో వేరే ఏదైనా థర్డ్ పార్టీ యాప్ ను యాక్టివేట్ చేసుకోండి.