రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరుసగా రెండవసారి రెపో రేటును 0.25 శాతం తగ్గించిన తర్వాత అనేక బ్యాంకులు తమ వడ్డీ రేట్లను సవరించాయి. రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు తగ్గింపు ప్రత్యక్ష ప్రభావం గృహ రుణ రేట్లపై కనిపిస్తోంది. చాలా గృహ రుణాలు రెపో రేటుతో ముడిపడి ఉన్నాయి. రెపో రేటు తగ్గినప్పుడు బ్యాంకులు గృహ రుణ వడ్డీ రేట్లను కూడా తగ్గిస్తాయి.
తాజాగా బ్యాంక్ ఆఫ్ ఇండియా తన గృహ రుణ వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం కొత్త, ప్రస్తుత రుణగ్రహీతలకు ఉపశమనం కల్పిస్తుంది. ఈ మార్పుతో గృహ రుణ రేటు వారి క్రెడిట్ స్కోరు ఆధారంగా సంవత్సరానికి 8.10 శాతం నుండి సంవత్సరానికి 7.90 శాతానికి తగ్గింది.
కస్టమర్లు తమ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి సహాయపడటానికి ఈ చర్య ఉపయోగపడుతుంది. సవరించిన రేట్లు ఏప్రిల్ 15, 2025 నుండి అమల్లోకి వస్తాయని బ్యాంకు పత్రికా ప్రకటన పేర్కొంది. గృహ రుణాలతో పాటు వాహన రుణం, వ్యక్తిగత రుణం, ఆస్తిపై రుణం, విద్య రుణం, స్టార్ రివర్స్ తనఖా రుణం వంటి ఎంపిక చేసిన రిటైల్ రుణ ఉత్పత్తులపై బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను కూడా తగ్గించింది.
ఏప్రిల్ 9న ఆర్‌బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. ఆర్‌బీఐ రెపో రేటు తగ్గించిన నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలా చేసింది.
వాహన రుణం, వ్యక్తిగత రుణం, ఆస్తిపై రుణం, విద్యా రుణం వంటి వాటిపై వడ్డీ రేటు తగ్గింపును తగ్గిస్తున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. కొత్త రేట్లు.. కొత్త, ఇప్పటికే ఉన్న రుణగ్రహీతలకు వర్తిస్తాయి. కానీ రేట్లు ఏప్రిల్ 15 నుండి అంటే మంగళవారం నుండి అమల్లోకి వస్తాయి.
రెపో రేటు తగ్గింపు తర్వాత సాధారణంగా దానితో అనుసంధానించిన రుణాలపై వడ్డీ తగ్గుదల కనిపిస్తుంది. స్థిర వడ్డీ రేట్లు ఉన్న రుణాలపై వడ్డీ రేట్లు తగ్గవు. గత రెండు ఎంపీసీ సమావేశాలలో బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ రెపో రేటును మొత్తం 50 బేసిస్ పాయింట్లు తగ్గించినప్పటికీ.. ఈ కోతలో ఎంత భాగాన్ని వినియోగదారునికి బదిలీ చేయాలో బ్యాంకులు నిర్ణయిస్తాయి.
సంబంధిత కథనం