Gold Rate Today: స్థిరంగా పసిడి ధర.. వెండి కూడా: నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే!-gold rate today flat silver price also remain same know latest price of gold silver ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Gold Rate Today Flat Silver Price Also Remain Same Know Latest Price Of Gold Silver

Gold Rate Today: స్థిరంగా పసిడి ధర.. వెండి కూడా: నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే!

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 26, 2023 06:19 AM IST

Gold Rate Today: బంగారం ధరల పెరుగుదలకు కాస్త విరామం వచ్చింది. నేడు ధరలు స్థిరంగా ఉన్నాయి. బంగారం కూడా ఫాలో అయింది. దేశంలోని వివిధ నగరాల్లో నేడు ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold Price Today: బంగారం నేటి ధరలు
Gold Price Today: బంగారం నేటి ధరలు (REUTERS)

Gold Rate: ఇటీవలి కాలంలో పైకి ఎగబాకుతూనే ఉన్న బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. దేశంలో నేడు (డిసెంబర్ 26) పసిడి ధరలు స్థిరంగా కొనసాగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.52,700 వద్ద ఉంది. కిందటి రోజు రేటే కొనసాగింది. 22 క్యారెట్ల 100 గ్రాముల ధర రూ.5,27,000గా ఉంది. మరోవైపు 24 క్యారెట్ల బంగారం కూడా ఇదే ఫాలో అయింది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.57,490 వద్ద కొనసాగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధర వివరాలివే..

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

ఏ సిటీలో.. ఎంత..

Gold Rate Today: దేశంలోని ప్రధాన నగరాల్లోనూ నేడు పసిడి ధరలు స్థిరంగానే కొనసాగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.52,850 వద్ద ఉంది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.57,650గా ఉంది. కోల్‍కతాలో 22 క్యారెట్ల తులం (10 గ్రాములు) పసిడి ధర రూ.52,700 వద్ద కొనసాగగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి వెల రూ.57,490గా ఉంది. ముంబైలోనూ ఇవే ధరలు కొనసాగాయి.

Gold Rate Today: అహ్మదాబాద్, బెంగళూరులో 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.52,750 వద్ద కంటిన్యూ అయింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం వెల రూ.57,550 వద్దే ఉంది. చెన్నై విషయానికి వస్తే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,450గా నమోదు కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ.58,310 వద్ద కొనసాగింది.

తెలుగు రాష్ట్రాల్లోనూ..

Gold Rate Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని మార్కెట్లలో కూడా కిందరి రోజు ధరలే నేడు కొనసాగాయి. హైదరాబాద్‍లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.52,700 వద్ద కొనసాగింది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.57,490గా ఉంది. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో కూడా ఇవే ధరలు కంటిన్యూ అయ్యాయి.

అంతర్జాతీయ మార్కెట్‍లో దూకుడు

స్పాట్ గోల్డ్ ధర మాత్రం అంతర్జాతీయ మార్కెట్‍లో పైకి వెళుతూనే ఉంది. నేడు ఏకంగా సుమారు 10 డాలర్లు పెరిగింది. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ఔన్సు ధర 1,946 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది. పెట్టుబడి కోసం ఎక్కువ మంది మదుపరులు.. బంగారం వైపు మళ్లుతుండటంతో పసిడి ధర పరుగులు పెడుతోంది.

వెండి కూడా అక్కడే..

Silver Rate Today: నేడు బంగారాన్నే ఫాలో అయింది వెండి. దేశీయ మార్కెట్‍లో సిల్వర్ రేటు నేడు స్థిరంగా కొనసాగింది. కిలో వెండి ధర రూ.72,500 వద్ద ఉంది. హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ సిటీల్లో కిలో వెండి రేటు రూ.74,000గా ఉంది. మరోవైపు ఢిల్లీ, ముంబై, కోల్‍కతాలో రూ.72,500 వద్ద కొనసాగింది.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

WhatsApp channel