Gold prices: రికార్డు స్థాయికి పెరిగిన బంగారం ధర-gold prices in india hit record high on january 13th 2023 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Gold Prices In India Hit Record High On January 13th 2023

Gold prices: రికార్డు స్థాయికి పెరిగిన బంగారం ధర

HT Telugu Desk HT Telugu
Jan 13, 2023 04:24 PM IST

Gold prices: పండుగ సీజన్ లో భారత్ లో బంగారం ధర (Gold price) భారీగా పెరిగింది. దాంతో డిమాండ్ కూడా తగ్గిందని డీలర్లు చెబుతున్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Gold price: బంగారం ధర భారత్ లో శుక్రవారం రికార్డు స్థాయికి చేరింది. దేశీయంగా 10 గ్రాముల బంగారం ధర రూ. 56,245 కి చేరి, రికార్డు సృష్టించింది. గతంలో, 2020 ఆగస్ట్ లో ఈ రికార్డు ధర రూ. 51,191గా ఉంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

Gold price: నవంబర్ నుంచి..

గత సంవత్సరం నవంబర్ నుంచి బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు సహా పలు అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారానికి డిమాండ్ పెరిగింది. మరోవైపు, బంగారం ధర అనూహ్యంగా పెరుగుతుండడంతో అదే స్థాయిలో బంగారానికి డిమాండ్ కూడా తగ్గుతోంది. బంగారం కొనుగోలుకు సంబంధించి భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మార్కెట్ అన్న విషయం తెలిసిందే. అమెరికా గురువారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఆ దేశంలో వినియోగ వస్తువుల ధరలు గత రెండేళ్ల కాలంలో తొలిసారి తగ్గాయి. దాంతో ప్రజల్లో ద్రవ్యోల్బణ ప్రతికూల ప్రభావం తగ్గుముఖం పడ్తుందేమోనన్న ఆశలు చిగురించాయి.

Gold price: రూ. 121

శుక్రవారం బంగారం ధర 10 గ్రాములకు ఢిల్లీలో రూ. 121 పెరిగి 56, 236కి చేరింది. అంతకుముందు రోజు రూ. 56, 115 కి చేరిన బంగారం శుక్రవారానికి రూ. 121 పెరిగింది. వెండి మాత్రం కేజీకి రూ. 145 తగ్గి, రూ. 68,729కి చేరింది.

WhatsApp channel

టాపిక్