Gold Rate: గత మూడు రోజులుగా శాంతంగా ఉన్న బంగారం ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. రేట్ల పెరుగుదలకు కాస్త బ్రేక్ తర్వాత మళ్లీ ఒక్కసారిగా జంప్ అయ్యాయి. దేశీయ మార్కెట్‍లో నేడు (ఫిబ్రవరి 2) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.500 పెరిగి రూ.53,000కు చేరింది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.550 పెరిగి రూ.57,820కు ఎగబాకింది. వెండి కూడా నేడు భారీగానే పెరిగింది. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన మునుపటి రోజే ఇలా దేశీయ మార్కెట్‍లో బంగారం, వెండి ధరలు మరోసారి అధికమయ్యాయి. దేశంలోని వివిధ సిటీల్లో నేడు పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.,హైదరాబాద్‍లో..Gold Price Today: హైదరాబాద్ మార్కెట్‍లోనూ నేడు పసిడి ధర పైకి వెళ్లింది. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల (తులం) బంగారం రేటు రూ.53,000కు ఎగబాకింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.57,820కు చేరింది. ఆంధ్రప్రదేశ్‍లోని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి సిటీల్లోనూ ఇవే ధరలు ఈ విధంగానే ఉన్నాయి.,దేశంలోని ప్రధాన నగరాల్లో ఇలా..Gold Rate Today: దేశంలోని మిగిలిన నగరాల్లోనూ బంగారం ధరలు అధికమయ్యాయి. ఢిల్లీలో 22 క్యారెట్లకు చెందిన తులం గోల్డ్ రేటు రూ.53,150కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం వెల రూ.57,980కు ఎగబాకింది. ముంబైలో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం రేటు రూ.53,000గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.57,820గా ఉంది. కోల్‍కతా, భువనేశ్వర్, కేరళలోనూ ధరలు ఇదే విధంగా అధికమయ్యాయి.,కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్లకు చెందిన తులం బంగారం ధర రూ.53,050కు పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.57,870కు చేరింది. అహ్మదాబాద్‍లోనూ ఇవే ధరలు ఉన్నాయి. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,150కి ఎగబాకింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.59,070కు చేరింది.,అంతర్జాతీయ మార్కెట్‍లో దూకుడుGold Rate Today: అంతర్జాతీయ మార్కెట్‍లోనూ స్పాట్ గోల్డ్ భగ్గుమంటోంది. స్పాట్ గోల్డ్ ధర నేడు భారీగా పెరిగింది. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ఔన్సు ధర 1,951 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఫెడ్ వడ్డీ రేటు పెరుగుదల అంచనాలు, ద్రవ్యోల్బణం కొనసాగింపుతో అంతర్జాతీయ మార్కెట్‍లో పసిడి ధరలు పరుగెడుతూనే ఉన్నాయి.,వెండి ధరలోనూ జంప్Silver Price Today: దేశీయ మార్కెట్‍లో నేడు వెండి ధర కూడా భారీగా అధికమైంది. కిలో వెండి ధర ఒక్కసారిగా రూ.1000 పెరిగి రూ.73,300కు ఎగబాకింది.,హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.76,000మార్కుకు చేరింది. ఢిల్లీ, కోల్‍కతా, ముంబై నగరాల్లో కేజీ వెండి ధర రూ.73,300కు పెరిగింది.,(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)