మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు; ఈ రోజు మీ నగరంలో గోల్డ్ ధర ఎంతో తెలుసుకోండి-gold price today in your city check gold rates in hyderabad mumbai bengaluru chennai and delhi on may 21 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు; ఈ రోజు మీ నగరంలో గోల్డ్ ధర ఎంతో తెలుసుకోండి

మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు; ఈ రోజు మీ నగరంలో గోల్డ్ ధర ఎంతో తెలుసుకోండి

Sudarshan V HT Telugu

భారత్ లో బుధవారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. అమెరికా డాలర్ విలువ పడిపోవడంతో పాటు ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికాలో నెలకొన్న ఆర్థిక అనిశ్చితి గురించి ఆందోళనల మధ్య బంగారం ధర నేడు భారీగా పెరిగింది.

మీ నగరంలో గోల్డ్ ధర (Photo: Pixabay )

భారత్ లో బుధవారం పసిడి ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి, డాలర్ విలువ పడిపోవడం తదితర కారణాలతో బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయానికి భారత్ లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 97.420 గా ఉంది. మే 20 మంగళవారం ఈ ధర రూ. 95,020 గా ఉంది. అంటే నిన్నటితో పోలిస్తే, ఈ రోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 2400 పెరిగింది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 89,300 గా ఉంది. మే 20 మంగళవారం ఈ ధర రూ. 87,100 గా ఉంది. అంటే నిన్నటితో పోలిస్తే, ఈ రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 2200 పెరిగింది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,070 గా ఉంది. మే 20 మంగళవారం ఈ ధర రూ. 71,270 గా ఉంది. అంటే నిన్నటితో పోలిస్తే, ఈ రోజు 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1800 పెరిగింది.

భారత్ లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు

భారత్ లోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ల్లో బుధవారం బంగారం ధరలను ఇక్కడ చూడండి.

హైదరాబాద్ లో బంగారం ధర

10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్ లో బుధవారం, మే 21వ తేదీన రూ. 97,420 గా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 89,300 గా ఉంది. విజయవాడ, విశాఖ పట్నంలలో కూడా ఇవే ధరలు ఉన్నాయి.

బెంగళూరులో బంగారం ధర

10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర బెంగళూరు లో బుధవారం, మే 21వ తేదీన రూ. 97,420 గా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 89,300 గా ఉంది.

చెన్నైలో బంగారం ధర

10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చెన్నై లో బుధవారం, మే 21వ తేదీన రూ. 97,420 గా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 89,300 గా ఉంది.

ఢిల్లీలో బంగారం ధర

10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఢిల్లీ లో బుధవారం, మే 21వ తేదీన రూ. 97,570 గా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 89,450 గా ఉంది

ముంబైలో బంగారం ధర

10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ముంబై లో బుధవారం, మే 21వ తేదీన రూ. 97,420 గా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 89,300 గా ఉంది

ఈ రోజు వెండి ధరలు

బుధవారం, మే 21వ తేదీన భారత్ లో కిలో వెండి ధర రూ. 1,00,000 గా ఉంది. ఇది నిన్నటి ధర కన్నా రూ. 3000 ఎక్కువ.

సూచన: ఈ ధరలు మే 21, బుధవారం మధ్యాహ్నం సమయానికి ఉన్న ధరలు. భారతదేశంలో బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా, అంతర్జాతీయంగా ఉన్న ధరల ద్వారా నిర్ణయించబడుతాయి. కొనుగోలు చేసేముందు, అధీకృత సంస్థల ద్వారా ఆ సమయంలో ఉన్న ధరను తెలుసుకోవాలని సూచిస్తున్నాం.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం