Gold Price Today: పెరిగిన పసిడి ధర, తగ్గిన వెండి .. నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే!-gold price today in hyderabad vijayawada delhi latest gold silver rates ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Gold Price Today In Hyderabad Vijayawada Delhi Latest Gold Silver Rates

Gold Price Today: పెరిగిన పసిడి ధర, తగ్గిన వెండి .. నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే!

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 17, 2022 06:11 AM IST

Gold Price today in India: దేశంలో నేడు పసిడి ధర నేడు (నవంబర్ 17) పైకి వెళ్లింది. వెండి రేటు మాత్రం తగ్గింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ సిటీల్లో నేటి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి.

Gold Price Today: పెరిగిన పసిడి ధర, తగ్గిన వెండి
Gold Price Today: పెరిగిన పసిడి ధర, తగ్గిన వెండి (REUTERS)

Gold, Silver Rates Today in India: దేశంలో బంగారం ధర మళ్లీ పెరుగుదల బాటపట్టింది. నిన్న ధరల్లో తగ్గుదల కనిపించగా.. నేడు (నవంబర్ 17) మళ్లీ పైకి వెళ్లింది. భారత మార్కెట్‍లో 22 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర నేడు రూ.200 పెరిగి, రూ.48,000కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.210 ఎగబాకింది. దీంతో 10 గ్రాముల రేట్ రూ.52,360గా ఉంది. వెండి ధరలో నేడు కాస్త తగ్గుదల కనిపించింది. హైదరాబాద్, విజయవాడతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు ఎన్నా ఉన్నాయంటే..

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

Gold Rate Today: తెలుగు రాష్ట్రాల్లో..

తెలుగు రాష్ట్రాల్లోనూ నేడు బంగారం ధరల్లో హెచ్చుదల కనిపించింది. హైదరాబాద్‍లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర నేడు రూ.48,000గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.52,360కు చేరింది. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు ఉన్నాయి.

Gold Rate Today: ప్రధాన నగరాల్లో..

దేశంలోని ఇతర నగరాల్లోనూ పసిడి రేటు పైకి వెళ్లింది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల వెల రూ.48,150కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,510గా ఉంది. కోల్‍కతాలో 22 క్యారెట్ల (10 గ్రాములు) గోల్డ్ ధర రూ.48,000, 24 క్యారెట్ల (10 గ్రాములు) రేట్ రూ.52,360గా ఉంది. ముంబై, కేరళ, భువనేశ్వర్‍లోనూ ఇవే ధరలు ఉన్నాయి. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.49,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,210కు చేరింది. బెంగళూరులో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.48,050కు చేరగా.. 24 క్యారెట్ల రేట్ రూ.52,410కు చేరింది. అహ్మదాబాద్‍లోనూ ఇదే ధర ఉంది.

డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ మారుతుండటం, ద్రవ్యోల్బణం సహా తదితర కారణాలతో బంగారం ధరలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

Silver Prices Today: తగ్గిన వెండి

దేశీయ మార్కెట్‍లో నేడు వెండి (సిల్వర్) ధర కాస్త కిందికి వచ్చింది. 1,000 గ్రాముల (కిలో) వెండిపై రూ.700 తగ్గింది. దీంతో నేడు కిలో వెండి ధర రూ.62,000గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర స్థిరంగా ఉంది. హైదరాబాద్‍, విజయవాడలో నేడు కేజీ వెండి ధర రూ.68,500గా ఉంది. విశాఖపట్నం, బెంగళూరులోనూ ఇదే రేట్ కొనసాగింది. దేశరాజధాని ఢిల్లీలో వెండి ధర తగ్గి.. కిలో వెండి ధర రూ.62,000కు చేరింది. ముంబై, కోల్‍కతా, పూణె, అహ్మదాబాద్ జైపూర్ నగరాల్లోనూ సిల్వర్ రేట్ ఇలానే ఉంది.

Platinum prices Today: ప్లాటినం ధరలు

నేడు ప్లాటినం ధరలు కూడా కాస్త తగ్గాయి. 10 గ్రాముల ప్లాటినం రేట్ రూ.340 దిగివచ్చింది. హైదరాబాద్, ఢిల్లీ సహా దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో ప్లాటినం ధర 10 గ్రాములకు రూ.26,480గా ఉంది.

WhatsApp channel