షాకింగ్​! భారీగా పెరిగిన బంగారం ధరలు- హైదరాబాద్​లో నేటి రేట్లు ఇలా..-gold price today in hyderabad and vijayawada 17th may 2025 silver rate ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  షాకింగ్​! భారీగా పెరిగిన బంగారం ధరలు- హైదరాబాద్​లో నేటి రేట్లు ఇలా..

షాకింగ్​! భారీగా పెరిగిన బంగారం ధరలు- హైదరాబాద్​లో నేటి రేట్లు ఇలా..

Sharath Chitturi HT Telugu

దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం, వెండి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

బెంగళూరులోని ఓ జ్యువెలరీ స్టోర్​లో నటి అనుష.. (PTI)

దేశంలో బంగారం ధరలు మే 17, శనివారం భారీగా పెరిగాయి. 10గ్రాముల పసిడి(24క్యారెట్లు) ధర రూ. 1220 పెరిగి.. రూ. 95,313కి చేరింది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 9,53,130కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 9,531గా కొనసాగుతోంది.

మరోవైపు 22 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 1120 వృద్ధి చెంది.. రూ. 87,383కి చేరింది. అదే సమయంలో 100 గ్రాముల(22క్యారెట్లు) పసిడి ధర రూ. 8,73,830గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం పెరిగాయి. కోల్​కతాలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 87,235గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 95,165గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 87,383 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 95,313గా ఉంది.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 87,231గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 95,161గా ఉంది. ఇక ముంబైలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 87,237గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 95,167గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 87,239గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 95,169గా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 87,245గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 95,175గా నమోదైంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 87,247గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 95,177గా నమోదైంది.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 87,291గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 95,221గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 87,230గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 95,160గా ఉంది.

అమెరికా- చైనా టారీఫ్ వార్​​పై అనిశ్చితి తొలగడం, ఫెడ్​ వడ్డీ రేట్లు, ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు శనివారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. ఢిల్లీలో 100 గ్రాముల వెండి ధర రూ. 10,000గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. రూ. 1,00,000కి చేరింది.

కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 1,11,200 పలుకుతోంది. వెండి ధరలు విజయవాడలో రూ.​ 1,12,000.. బెంగళూరులో రూ. 1,09,600గా ఉంది.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం