Gold price today : మే 18 : మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..-gold price today hyerabad 18th may 2024 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold Price Today : మే 18 : మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

Gold price today : మే 18 : మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

Sharath Chitturi HT Telugu

Gold price today : దేశంలో పసిడి ధరలు స్వల్పంగా పడ్డాయి. వెండి ధరలు కూడా తగ్గాయి. ప్లాటీనం రేట్లు సైతం దిగొచ్చాయి. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా.. (PTI)

Gold price today : దేశంలో బంగారం ధరలు శనివారం స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 దిగొచ్చి.. రూ. 67,590కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 67,600గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి, రూ. 6,75,900కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 6,759గా ఉంది.

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 10 తగ్గి.. రూ. 73,740కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 73,750గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 దిగొచ్చి.. రూ. 7,37,400గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 7,374గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 67,740గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,890గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 67,590 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 73,740గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 67,690గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,840గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 67,590గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 73,740గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 67,590గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,740గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 67,640గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 73,790గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 67,590గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,740గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు శనివారం తగ్గాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 8,900గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 100 తగ్గి.. రూ. 89,000కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 89,100గా ఉండేది.

Silver price today : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 92,400 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 89,000.. బెంగళూరులో రూ. 88,400గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు శనివారం తగ్గాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 80 తగ్గి.. రూ 28,310కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 28,390గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 28,310గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

సంబంధిత కథనం