Gold Price Today: దేశంలో పసిడి ధరలకు రెక్కలు వచ్చాయి. రేట్లు అమాంతం పెరిగిపోయిన్నాయి. ధరలు (Gold Rates) కొత్త ఆల్‍టైమ్ గరిష్ఠానికి చేరుకుంటున్నాయి. నేడు (జనవరి 25) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.350 పెరిగి రూ.52,700కు ఎగబాకింది. 24 క్యారెట్ల 10 గ్రాముల (తులం) పసిడి రేటు రూ.380 అధికమై రూ.57,490కు చేరింది. 24 క్యారెట్ల 100 గ్రాముల బంగారం ధర రూ.5,74,900గా ఉంది. వెండి ధర కూడా మరోసారి పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..,హైదరాబాద్‍లో..Gold Price Today in Hyderabad, Vijayawada: హైదరాబాద్ మార్కెట్‍లోనూ పసిడి ధర జంప్ చేసింది. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.52,700కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.57,490కు ఎగబాకింది. ఆంధ్రప్రదేశ్‍లోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలోనూ ఇవే ధరలు ఉన్నాయి.,ఢిల్లీ సహా మరిన్ని ప్రధాన నగరాల్లో..Gold Price Today in Delhi: ఢిల్లీతో పాటు దేశంలోని ఇతర సిటీల్లోనూ నేడు బంగారం రేట్లు ఎగబాకాయి. ఢిల్లీలో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల పసిడి ధర రూ.52,850కు చేరగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.57,650కు ఎగబాకింది. ముంబై, కోల్‍కతా నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.52,700కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.57,490కు పెరిగింది. భువనేశ్వర్, కేరళలోనూ ఇవే ధరలు ఉన్నాయి.,బెంగళూరులో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.52,750కు చేరింది. 24 క్యారెట్ల తులం పసిడి వెల రూ.57,550కు ఎగబాకింది. అహ్మదాబాద్‍లోనూ ఇదే ధర నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.53,550, 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.58,420కు ఎగబాకింది.,అంతర్జాతీయ మార్కెట్‍లో..అంతర్జాతీయ మార్కెట్‍లో బంగారం ధర అడ్డులేకుండా పెరుగుతూపోతోంది. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 1,936 డాలర్లకు ఎగబాకింది. అమాంతం 1,900 డాలర్ల ఎగువకు చేరింది. ప్రపంచవ్యాప్తంగా పసిడికి ఒక్కసారిగా డిమాండ్ పెరగడం, ద్రవ్బోల్బణంలో మార్పు బంగారం ధరను ప్రభావితం చేస్తున్నాయి.,వెండి ధరలు ఇలా..Silver Price Today: దేశీయ బులియన్ మార్కెట్‍లో వెండి కూడా పరుగులు పెట్టింది. నేడు కిలో వెండి ధర రూ.200 పెరిగి రూ.72,500కు చేరింది. 100 గ్రాముల ధర రూ.7,250గా ఉంది.,హైదరాబాద్‍లో కిలో వెండి ధర రూ.74వేల మార్కును తాకింది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నైలోనూ ఇదే ధర ఉంది. ఢిల్లీ, కోల్‍కతా, ముంబైలో కిలో వెండి ధర రూ.72,500కు ఎగబాకింది.