Gold Rate Today: బంగారం, వెండి కొనాలనుకుంటున్న వారికి తీపికబురు ఇది. దేశంలో పసిడి, వెండి ధరలు వరుసగా రెండో రోజు భారీగా దిగివచ్చాయి. నేడు (ఫిబ్రవరి 5) 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.700 తగ్గి రూ.52,400కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల (తులం) పసిడి ధర రూ.770 క్షీణించి రూ.57,160కు దిగివచ్చింది. బులియన్ మార్కెట్‍లో నేడు వెండి ధర కూడా తగ్గింది. నేడు దేశంలోని వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..,హైదరాబాద్‍లో..Gold Rate today in Hyderabad: హైదరాబాద్‍లోనూ బంగారం ధర నేడు తగ్గింది. 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.52,400కు వచ్చింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,160కు చేరింది. ఆంధ్రప్రదేశ్‍లోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి.,దేశంలోని ముఖ్య నగరాల్లో ఇలా..Gold Price today in Delhi: దేశ రాజధాని ఢిల్లీతో పాటు ప్రధాన నగరాల్లో పసిడి ధర క్షీణించింది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.52,550కు చేరింది. 24 క్యారెట్లకు చెందిన తులం బంగారం ధర రూ.57,310కి దిగివచ్చింది. కోల్‍కతా, ముంబై నగరాల్లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.52,400, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,160కు దిగివచ్చింది. భువనేశ్వర్, కేరళలోనూ ఇవే ధరలు నమోదయ్యాయి.,బెంగళూరులో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.52,450కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.57,210కు వచ్చింది. అహ్మదాబాద్, రాజ్‍కోట్‍లోనూ ఇవే ధరలు ఉన్నాయి. తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,350కు వచ్చింది. 24 క్యారెట్లకు చెందిన తులం పసిడి రేటు రూ.58,200కు చేరింది.,ఈ ప్రభావంతో..అంతర్జాతీయ మార్కెట్‍లో ఇటీవల ఒక్కసారిగా ఎగిసిన బంగారం ధరలు.. మళ్లీ తగ్గుతున్నాయి. స్పాట్ గోల్డ్ ధర నేడు ఏకంగా రెండున్నర శాతానికిపైగా క్షీణించింద. దీంతో స్పాట్ గోల్డ్ ఔన్సుధర 1,865 డాలర్లకు దిగివచ్చింది. దీంతో భారత్‍లోనూ బంగారం ధరలు రెండు రోజుల నుంచి తగ్గుతున్నాయి. ద్రవ్యోల్బణం క్రమంగా దిగివస్తుందన్న అంచనాలు, ఫెడ్ వడ్డీ రేటు పెంపును తగ్గించడం బంగారం ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి.,వెండి కూడా డౌన్Silver Rate Today: దేశీయ మార్కెట్‍లో నేడు (ఫిబ్రవరి 5) వెండి ధర కూడా భారీగా తగ్గింది. కిలో వెండి ధర ఏకంగా రూ.2,600 క్షీణించి రూ.71,200కు దిగివచ్చింది. 100 గ్రాముల వెండి ధర రూ.7,120కు చేరింది.,హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, చెన్నైలో కిలో వెండి ధర రూ.74,200కు చేరింది. ఢిల్లీ, ముంబై, కోల్‍కతా, అహ్మదాబాద్‍లో కేజీ వెండి ధర రూ.71,200కు దిగివచ్చింది.,(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)