Gold rate Today: మరింత తగ్గిన పసిడి, వెండి అలానే.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే!-gold price today check latest rates of gold and silver in hyderabad ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Gold Price Today Check Latest Rates Of Gold And Silver In Hyderabad

Gold rate Today: మరింత తగ్గిన పసిడి, వెండి అలానే.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే!

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 30, 2022 06:11 AM IST

Gold and Silver price today: బంగారం ధర నేడు కాస్త తగ్గింది. వెండి మాత్రం స్థిరంగా ఉంది. దేశంలోని వివిధ నగరాల్లో వసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి.

Gold rate Today: మరింత తగ్గిన పసిడి, వెండి అలానే.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే!
Gold rate Today: మరింత తగ్గిన పసిడి, వెండి అలానే.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే! (REUTERS)

Gold and Silver rates today: దేశీయ మార్కెట్‍లో నేడు పసిడి ధర మరింత తగ్గింది. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గి.. రూ.48,460కు చేరింది. సోమవారం ఈ ధర రూ.48,560గా ఉండగా.. నేడు కాస్త దిగివచ్చింది. ఇక 24 క్యారెట్ల బంగారం కూడా ఈమేర దిగివచ్చింది. 24 క్యారెట్ల (10 గ్రాములు) గోల్డ్ రేట్ రూ.100 తగ్గి.. రూ.52,880 వద్ద స్థిరపడింది. మరోవైపు నేడు దేశంలో వెండి ధర స్థిరంగా ఉంది. ఇక ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో..

Today Gold Price Hyderabad: హైదరాబాద్ మార్కెట్‍లోనూ బంగారం ధర నేడు దిగివచ్చింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేట్ రూ.48,460కు వచ్చింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.52,880గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, అనంతపురంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పడిసి ధర రూ.48,450, 24 క్యారెట్ల (10 గ్రాములు) వెల రూ.52,850గా ఉంది.

దేశంలోని ఇతర నగరాల్లో..

Gold price today in India: దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల పసిడి ధర నేడు రూ.48,610కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.53,040గా ఉంది. జైపూర్ లో ఇదే ధర ఉంది.

కోల్‍కతా, ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి వెల రూ.48,460, 24 క్యారెట్ల 10 గ్రామల బంగారం ధర రూ.52,880కు చేరింది. కేరళ, పుణె, భువనేశ్వర్‍లోనూ ఇవే ధరలు ఉన్నాయి. బెంగళూరులో 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ.48,510గా ఉంది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల వెల రూ.52,930కు చేరింది. అహ్మదాబాద్‍లోనూ నేడు ధరలు ఇలానే ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్‍లో స్పాట్ గోల్డ్ రేట్ కాస్త పెరిగింది. ప్రస్తుతం స్పాట్ బంగారం ఔన్సుకు 1,749 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ముఖ్యంగా డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ మారుతుండటంతో.. ఇండియా బులియన్ మార్కెట్‍లో బంగారం ధరల్లో క్రమంగా హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి.

Silver Prices Today: నేటి వెండి ధరలు

బంగారం ధర నేడు కాస్త తగగ్గా.. వెండి మాత్రం స్థిరంగా కొనసాగింది. 100 గ్రాముల వెండి రూ.6,140, కిలో వెండి ధర రూ.61,400 వద్ద ఉంది.

హైదరాబాద్‍లో కిలో వెండి ధర రూ.68,100గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, అనంతపురం, బెంగళూరులోనూ ధర ఇదే విధంగా కొనసాగింది.

ఢిల్లీలో కేజీ వెండి ధర బుధవారం రూ.61,400గా ఉంది. కోల్‍కతా, ముంబై, అహ్మదాబాద్‍లోనూ ఇదే ధర ఉంది.

ప్లాటినం ధరలు

Platinum Prices Today: ప్లాటినం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల ప్లాటినం వెల రూ.90 తగ్గి .. రూ.25,650 వద్దకు చేరింది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై సహా దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో ప్లాటినం ధర ఇలాగే ఉంది.

WhatsApp channel