Gold price today : పెరిగిన పసిడి, స్థిరంగా వెండి ధరలు.. నేటి లెక్కలివే!-gold price today 9th december 2023 in telugu ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Gold Price Today 9th December 2023 In Telugu

Gold price today : పెరిగిన పసిడి, స్థిరంగా వెండి ధరలు.. నేటి లెక్కలివే!

Sharath Chitturi HT Telugu
Dec 09, 2023 05:48 AM IST

Gold price today : దేశంలో పసిడి ధరలు పెరిగాయి. వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఆ వివరాలు..

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

Gold price today : దేశంలో బంగారం ధరలు శనివారం పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 150 పెరిగి.. రూ. 57,700కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 57,550గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 1,500 పెరిగి, రూ. 5,77,000కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 5,700గా కొనసాగుతోంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 170 వృద్ధి చెంది.. రూ. 62,950కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 62,780గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 1,700 పెరిగి.. రూ. 6,29,500గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,850గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,100గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,700 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 62,950గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 58,2250గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,660గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 57,700గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 62,950గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,700గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,950గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,750గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 63,000గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 57,700గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,950గా ఉంది.

స్థిరంగా వెండి ధరలు..

దేశంలో వెండి ధరలు శనివారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,720గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 77,200గా కొనసాగుతోంది. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 80,000 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 77,200.. బెంగళూరులో రూ. 76,000గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు శనివారం భారీగా పెరిగాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 590 పెరిగి.. రూ. 24,390కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 23,800గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 24,390గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

WhatsApp channel

సంబంధిత కథనం