Gold price today 27 November : స్థిరంగా పసిడి, వెండి ధరలు.. నేటి లెక్కలివే!-gold price today 27 november 2023 in telugu states ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Gold Price Today 27 November 2023 In Telugu States

Gold price today 27 November : స్థిరంగా పసిడి, వెండి ధరలు.. నేటి లెక్కలివే!

Sharath Chitturi HT Telugu
Nov 27, 2023 09:15 AM IST

Gold price today 27 November : దేశంలో పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలో కూడా మార్పు లేదు. ఆ వివరాలు..

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

Gold price today 27 November : దేశంలో బంగారం ధరలు సోమవారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 57,100గా ఉంది. సోమవారం కూడా ఇదే ధర పలికింది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. రూ. 5,71,000గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 5,710గా కొనసాగుతోంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 62,290గా ఉంది. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 6,22,900గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు సోమవారం స్థిరంగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,250గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,440గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,100 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 62,290గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,550గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,780గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 57,100గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 62,290గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,100గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,290గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,150గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 62,340గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 57,100గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,290గా ఉంది.

ఇజ్రయెల్​ పాలస్తీనా యుద్ధం, దేశంలో గొల్డ్​కి ఉన్న డిమాండ్​ వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు సైతం సోమవారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,720గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 77,200గా కొనసాగుతోంది. ఆదివారం కూడా ఇదే ధర పలికింది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 80,200 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 77,200.. బెంగళూరులో రూ. 76,250గా ఉంది.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

WhatsApp channel

సంబంధిత కథనం